నిర్లక్ష్యం : ఫోన్లో మాట్లాడుతూ ఒకేసారి రెండు డోసులిచ్చిన నర్స్.. ట్విస్ట్ ఏంటంటే..

By AN TeluguFirst Published Jun 19, 2021, 10:46 AM IST
Highlights

వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికే జనాల్లో అనేక భయాందోళనలు ఉన్నాయి.  వాటిని పోగొట్టే దిశగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లు అనేక ప్రచారాలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానకి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన చిన్న పొరపాటు ఓ యువతిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. 

వ్యాక్సిన్ వేసే నర్సు నిర్లక్ష్యం ఆ యువతిని భయాందోళనల్లోకి నెట్టేసింది. రంగారెడ్డి జిల్లాలో ఓ యువతికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చేశారు. వెంటనే తప్పు గ్రహించి ఆ యువతిని గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రిలో అబ్జర్వేషన్ లో పెట్టారు. 

వివరాల్లోకి వెడితే అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ కు లక్ష్మీ ప్రసన్న (21) అనే యువతి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లింది. అక్కడ వ్యాక్సినేషన్ చేస్తున్న నర్స్ పద్మ ఫోన్ లో మాట్లాడుతూ లక్ష్మీ ప్రసన్నకు వెంటవెంటనే రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చింది. 

దీంతో వ్యాక్సిన్ తీసుకున్న కాసేపటికే లక్ష్మీ ప్రసన్న కళ్లు తిరిగి కింద పడిపోయింది. వెంటనే ఆమెను అధికారులు వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అబ్జర్వేషన్ లో పెట్టారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయినప్పటికీ వైద్యులు ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచారు. 

click me!