బొల్లినేని గాంధీ భార్యకు నోటీసులివ్వండి... హైకోర్టు...

By AN TeluguFirst Published Jun 19, 2021, 10:31 AM IST
Highlights

హైదరాబాద్: మాజీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండవ నిందితురాలైన బొల్లినేని శిరీషను విచారణాధికారులు విచారించాలనుకుంటే సిఆర్‌పిసి సెక్షన్ 41-ఎ కింద నోటీసు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం సిబిఐని ఆదేశించారు.  బొల్లినేని శిరీష.. బొల్లినేని శ్రీనివాస గాంధీ గాంధీ భార్య.

శిరీష దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. ఆయన ఆదేశాల మేరకు పిటిషన్‌ను డిస్పోస్ చేశారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది టి ప్రద్యుమ్నా కుమార్ రెడ్డి హాజరయ్యారు. సిబిఐ అధికారులు కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేశారు.

సిబిఐ న్యాయవాది కె. సురేందర్ ఈ ఆరోపణలను ఖండించారు. గాంధీకి, అతని భార్యకు నోటీసులు ఇచ్చిన తరువాత.. గాంధీ ఓ హోటల్ లో సాక్షులను బెదిరించారని పక్కా సమాచారం ఉండడం వల్లే.. గాంధీని అరెస్ట్ చేశామని తెలిపారు. సీబీఐ ఇంతకు ముందు గాంధీ, అతని భార్య మీద డిఎ కేసు నమోదు చేసి గాంధీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

click me!