RSS Chief Mohan Bhagwat: ఇవాల్టి రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు వస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్

Published : Feb 09, 2022, 01:24 PM IST
RSS Chief Mohan Bhagwat: ఇవాల్టి రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు వస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్

సారాంశం

RSS Chief Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇవాళ హైదరాబాద్ కి రానున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌ శ్రీరామ నగరంలో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ పాల్గొంటారు. త్రిదండి చిన జీయర్‌ స్వామి ఆహ్వానం మేరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు వస్తున్నారు.   

RSS Chief Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇవాళ హైదరాబాద్ కి రానున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌ శ్రీరామ నగరంలో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ పాల్గొంటారు. త్రిదండి చిన జీయర్‌ స్వామి ఆహ్వానం మేరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు వస్తున్నారు. మధ్యాహ్నం 3.30 కి ముచ్చింతల్ కు ఆయన రానున్నారు. రాత్రి 8 గంటల వరకు వివిధ కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొంటారు.  ప్రవచన మండపంలో జరిగే ధర్మాచార్య సభలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రసంగించనున్నారు. అలాగే..  మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఆర్ఎస్ఎస్ కి చెందిన భయ్యాజీ జోషీ లు కూడా  శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను సందర్శించనున్నారు. 

 హైదరాబాద్  శివారు శంషాబాద్ కు సమీపంలో ఉన్న ముచ్చింతల్(Muchintal)లో ఆధ్మాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.  శ్రీరామనగరం భక్తజనంతో నిండిపోయింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి (Sri Chinna Jeeyar Swamy) ఆధ్వర్యంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భ‌క్తులు తరలివస్తున్నారు. 216 అడుగుల భగవద్రామానుజ చార్యుభ‌ల విగ్రహాన్ని(Statue Of Equality) సంద‌ర్శించుకుని తామ‌ని తాము మైమ‌రిచిపోతున్నారు. ఈ మ‌హా క్ర‌తువులో 5 వేల మంది రుత్విజులు యాగశాలలో హోమాలను నిర్వహిస్తున్నారు. 114 యాగశాలల్లో 1035 హోమ గుండాల్లో పారాయణల మధ్య ఘనంగా హోమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 108 దివ్య దేశాల్లో ఆలయాల్లో ప్రాణప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే.

 8వ రోజు సహస్రాబ్ది ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు

– ఉదయం 6.30 గంటలకుఅష్టాక్షరీ మంత్ర పఠనం
– ఉదయం 7.30 గంటలకు శ్రీ పెరుమాళ్ ప్రాతఃకాల ఆరాధన.
– ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం
– ఉదయం 10 గంటలకు శ్రీలక్ష్మీనారాయణ ఇష్టి
– ఉదయం 10 గంటలకు వైనతేయ ఇష్టి
– ఉదయం 10.30 గంటలకు హయగ్రీవపూజ 
– ఉదయం 10.30 గంటలకు దేశంలోని ప్రముఖ సాధుసంతులచే రెండోరోజు ధర్మాచార్య సదస్సు. ఇందులో 200 మంది సాధు, సంతులు, పీఠాధిపతులు. పాల్గొననున్నారు.
– మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్ణాహుతి
– మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రవచనమండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు
– సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం
– రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్