ఆగస్టు 8న బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. వేదికగా నల్గొండ, 5 లక్షల మందితో భారీ సభ

By Siva KodatiFirst Published Jul 27, 2021, 9:13 PM IST
Highlights

మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగస్టు 8న బీఎస్పీలో చేరనున్నారు. తెలంగాణ బీఎస్పీ కో ఆర్డినేటర్ రాంజీ గౌతం సమక్షంలో ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో చేరనున్నారు
 

మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ రంగ ప్రవేశం ఖరారైన సంగతి తెలిసిందే. ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరుతున్నట్లు స్వయంగా ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 8న నల్గొండలోని ఎన్‌జీ కాలేజ్ మైదానంలో జరిగే భారత బహిరంగ సభలో తెలంగాణ బీఎస్పీ కో ఆర్డినేటర్ రాంజీ గౌతం సమక్షంలో ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో చేరనున్నారు. ఈ సభకు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. 

ప్రవీణ్ కుమార్ కు బిఎస్పీ అధినేత్రి మాయావతి ఆఫర్ ఇచ్చినట్లు ఇంతకు ముందు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రవీణ్ కుమార్ కు తెలంగాణ బిఎస్పీ అధ్యక్ష పదవిని ఇవ్వడానికి ఆమె సిద్ధఫడినట్లు వార్తలు వచ్చాయి. అదే ఇప్పుడు నిజం కాబోతోంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. స్వేరోలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వస్తున్నారు. ఆయన స్వేరో అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 50 వేల మంది సభ్యులున్నారు. 

ALso Read:బిఎస్పీలోకి ఐపిఎస్ ప్రవీణ్ కుమార్: మాయావతి ఆమోదం

ఫూలే, అంబేడ్కర్ సిద్ధాంతంతో తాను ముందుకు సాగుతానని ప్రవీణ్ కుమార్ తాను రాజీనామా చేసినప్పుడు చెప్పారు. సొంత రాజకీయ పార్టీ పెట్టాలని ఆయన ఆలోచించారు. అయితే, అందుకు తగిన సాధన సంపత్తిని సమకూర్చుకోవడం ఇబ్బంది అవుతుందనే భావనతో ఆయన వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. 
 

click me!