సంసారంలో మద్యం చిచ్చు.. పీకలదాకా తాగి భార్యను చంపిన భర్త

Siva Kodati |  
Published : Jul 27, 2021, 08:34 PM ISTUpdated : Jul 27, 2021, 08:35 PM IST
సంసారంలో మద్యం చిచ్చు.. పీకలదాకా తాగి భార్యను చంపిన భర్త

సారాంశం

పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడో భర్త. 

వారిద్దరూ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు.. రెండేళ్లు కలిసి కాపురం చేశారు. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో మద్యం రక్కసి చిచ్చుపెట్టింది. మద్యం మత్తులో ఏకంగా కట్టుకున్న భార్యనే హత్య చేశాడో ఆటోడ్రైవర్. వివరాల్లోకి వెళితే.. గోదావరిఖని పీకే రామయ్య కాలనీకి చెందిన శ్రీ వేణినీ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల చెందిన ప్రశాంత్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయినా ప్రశాంత్ మద్యానికి బానిసై కట్టుకున్న భార్యతో నిత్యం గొడవ పడేవాడు. ఈ క్రమంలో మంగళవారం భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న ప్రశాంత్ భార్యను కర్రతో కొట్టిచంపి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Flood Alert : తెలంగాణకు పొంచివున్న వరద ముప్పు... ఆస్తి, ప్రాణనష్టం తప్పదా?
భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన వ్యాఖ్యలు | Bonalu 2026 | Asianet News Telugu