చావడానికైనా సిద్ధం.. ఎవరికీ భయపడను: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Published : Jul 24, 2021, 07:52 AM IST
చావడానికైనా సిద్ధం.. ఎవరికీ భయపడను: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సారాంశం

ఒక్క ప్రవీణ్ కుమార్ పై కేసులు పెడితే కోట్లాది మంది ప్రవీణ్ కుమారులు పుట్టుకువస్తారని ఆయన పేర్కొన్నారు. 

తాను  చావుకైనా సిద్ధమేనని.. ఎవరికీ భయపడనని మాజీ ఐపీఎస్ అధికారి  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బహుజన రాజ్యాధికర సాధన కోసం మరణించడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. పదవీ విరమణ చేసిన  మరుసటి రోజే పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు.

తాను అంబేడ్కర్ బాటలో నడిచేందుకు ఒంటరి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఒక్క ప్రవీణ్ కుమార్ పై కేసులు పెడితే కోట్లాది మంది ప్రవీణ్ కుమారులు పుట్టుకువస్తారని ఆయన పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నానని.. తన తల్లి ప్రశ్నిస్తే.. కోట్లాది మంది దళిత బిడ్డలను బాగు చేసేందుకు తాను రాజీనామా చేశానని ఆయన పేర్కొన్నారు.

వందల సంవత్సరాలుగా దళితులు అణచివేతకు గురవుతున్నారని, వారిపై కుట్రలు, కుతంత్రాలు జ రుగుతున్నాయని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మటన్, చికెన్‌ దావత్, బీరు, బిర్యానీలు, తాయిలాలకు మో సపోయే జాతులు మనవి కావని, రాజ్యాధికారం సాధించుకునేందుకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మన రాజ్యం వస్తుందని అలంపూర్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు, తాండూర్‌ నుంచి నల్లగొండ వరకు ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?