కొత్తగా 643 మందికి పాజిటివ్... తెలంగాణలో 6,40,012కి చేరిన మొత్తం కేసులు

Siva Kodati |  
Published : Jul 23, 2021, 09:05 PM IST
కొత్తగా 643 మందికి పాజిటివ్... తెలంగాణలో 6,40,012కి చేరిన మొత్తం కేసులు

సారాంశం

తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు నమోదవ్వగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో 767 మంది కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 9,729 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,20,535 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 643 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,40,012కు చేరింది. 24 గంటల వ్యవధిలో నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3,778కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 767 మంది కోలుకోవడంతో తెలంగాణ ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 6,26,505కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,729 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 7, భద్రాద్రి కొత్తగూడెం 19, జీహెచ్ఎంసీ 77, జగిత్యాల 22, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల 4, కామారెడ్డి 2, కరీంనగర్ 68, ఖమ్మం 57, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 15, మంచిర్యాల 22, మెదక్ 5, మేడ్చల్ మల్కాజిగిరి 29, ములుగు 6, నాగర్ కర్నూల్ 6, నల్గగొండ 35, నారాయణపేట 0, నిర్మల్ 2, నిజామాబాద్ 9, పెద్దపల్లి 46, సిరిసిల్ల 17, రంగారెడ్డి 31, సిద్దిపేట 11, సంగారెడ్డి 10, సూర్యాపేట 41, వికారాబాద్ 4, వనపర్తి 3, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 54, యాదాద్రి భువనగిరిలో 12 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !