అఫైర్ అనుమానం: భార్యాకూతుళ్లను చంపేసిన దుర్మార్గుడు

Published : Jul 24, 2021, 07:06 AM IST
అఫైర్ అనుమానం: భార్యాకూతుళ్లను చంపేసిన దుర్మార్గుడు

సారాంశం

భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి దారుణచర్యకు ఒడిగట్టాడు. భార్యాకూతుళ్లను గొడ్డలితో నరికి చంపి ఆ తర్వాత పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.

నిజామాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. భార్య ప్రవర్తనపై ఓ వ్యక్తి అనుమానం పెంచుకున్నాడు. దాంతో ఆమెను చంపేశాడు. తల్లికి మద్దతుగా నిలిచిందనే కోపంతో కూతురిని కూడా హతమార్చాడు. ఆ తర్వాత పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. 

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఆ సంఘటన జరిగింది. బోధన్ మండలం పెద్ మావందికుర్దు గ్రామానికి చెందిన మల్లీశ్వరికి రుద్రూర్ కు చెందిన బోజేడి గంగాధర్ తో దాదాపు 15 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి రుత్విక అనే కూతురు ఉంది. 

కొన్నేళ్ల పాటు కలతలు లేకుండా కాపురం సాగింది. అయితే, ఆ తర్వాత భార్య ప్రవర్తనపై కొన్నాళ్ల క్రితం గంగాధర్ కు అనుమానం కలిగింది. దాంతో ఆమె వెధిస్తూ వచ్చాడు. ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. కూతురు రుత్విక తల్లికి మద్దతుగా మాట్లాడింది. దాంతో తల్లీకూతుళ్లపై గంగాధర్ కక్ష పెంచుకున్నాడు. 

నిద్రలో ఉన్న భార్య మల్లీశ్వరి (30), కూతురు రుత్విక (13)ను శుక్రవారం తెల్లవారు జామున గంగాధర్ నరికి చంపాడు. ఆయ తర్వాత ఇంటికి తాళం వేసి పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో CM Revanth Reddy Speech | Gaddar Awards | Asianet News Telugu
ఉగాది పంచాంగ శ్రవణం కేటీఆర్ జాతకం చెప్పిన పండితులు KTR Attend Ugadi Celebrations | Asianet Telugu