కన్నతల్లి మెడకు కరెంట్ వైర్ బిగించి.. హతమార్చిన కొడుకు..

Published : Sep 25, 2021, 11:40 AM IST
కన్నతల్లి మెడకు కరెంట్ వైర్ బిగించి.. హతమార్చిన కొడుకు..

సారాంశం

బలవంత్ మద్యం సేవించి జులాయిగా తిరుగుతుండేవాడు. ఏ పనీ చేయకపోగా డబ్బలు కోసం తల్లికి వచ్చే వితంతు పెన్షన్, రైతు బంధు కోసం నిత్యం గొడవ పడే వాడు అని స్తానికులు చెబుతున్నారు. పెన్షన్ డబ్బుల కోసం నిన్న రాత్రి కూడా తల్లితో తీవ్రంగా గొడవ పడ్డాడు. 

వికారాబాద్ : పరిగిలో దారుణం జరిగింది. నవమాసాలు మోసి.. కనీ పెంచిన తల్లినే దారుణంగా హతమార్చాడో(Murder)తనయుడు. పరిగి మండలం కుదావంద్ పూర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఓ జులాయి కొడుకు కన్నతల్లిని(mother) అత్యంత దారుణంగా హతమార్చాడు. తల్లి భీమమ్మ (55)మెడకు కరెంట్ వైరు బిగించి బలవంత్ అనే వ్యక్తి హత్య చేశాడు. 

బలవంత్ మద్యం సేవించి జులాయిగా తిరుగుతుండేవాడు. ఏ పనీ చేయకపోగా డబ్బలు కోసం తల్లికి వచ్చే వితంతు పెన్షన్, రైతు బంధు కోసం నిత్యం గొడవ పడే వాడు అని స్తానికులు చెబుతున్నారు. పెన్షన్ డబ్బుల కోసం నిన్న రాత్రి కూడా తల్లితో తీవ్రంగా గొడవ పడ్డాడు. 

రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు: ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్

ఈ క్రమంలో వాడి మనసులో దుర్మార్గమైన ఆలోచన రూపుదిద్దకుంది. తల్లిని చంపేస్తే ఆమె రైతు కాబట్టి.. రైతు భీమా సొమ్ములు వస్తాయని ఆలోచించాడు. అలాగనే రైతు భీమా డబ్బలు కోసమే తల్లిని హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. 

తల్లిని చంపిన తరువాత విషయం వెంటనే బైటికి పొక్కలేదు. అయితే బలవంత్ ప్రవర్తనను అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు జరిగిన దారుణాన్ని గమనించారు. వెంటనే బలవంత్ ను అదుపులోకి తీసుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పలితాలు.. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్..?
Viral News: అస‌లేంటీ కోవా బ‌న్ వివాదం.? ఎందుకు ఇంత‌లా వైర‌ల్ అవుతోంది