దసరాకి మద్యం కిక్కు: తెలంగాణలో ఐదు రోజుల్లో రూ.685 కోట్ల మద్యం విక్రయాలు

By narsimha lodeFirst Published Oct 17, 2021, 1:09 PM IST
Highlights

దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. ఐదు రోజుల వ్యవధిలో రూ.685 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు వివరించారు.గత వారం రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో రూ.222.23 కోట్ల  విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ అధికారులు  తెలిపారు.

హైదరాబాద్: Dussehra సందర్భంగా Telangana భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగాయని ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. దసరా పండుగకు వారం రోజుల ముందు నుండే మద్యం విక్రయాలు జోరందుకున్నాయి.

also read:Huzuraba Bypoll: హుజురాబాద్‌లో రూ. 3 లక్షల నగదు పట్టివేత.. విస్తృత తనిఖీలు

గత వారం రోజుల్లో Ghmc పరిధిలో రూ.222.23 కోట్ల  విలువైన liquor అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ అధికారులు  తెలిపారు. ఈ నెల  12 నుంచి 14వ తేదీ మధ్య కేవలం  మూడు రోజుల్లోనే సుమారు  రూ.75 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. దసరా సందర్భంగా  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్‌ జిల్లాల పరిధిలో 7.78 లక్షల  కేసుల లిక్కర్, మరో 2.36 లక్షల  కేసులు బీర్లు అమ్ముడైనట్లు  అధికారులు పేర్కొన్నారు.కేవలం  5 రోజుల్లోనే రూ.685 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు వివరించారు.ప్రస్తుతం దాదాపుగా 29 శాతం వరకు మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం తో సర్కార్‌ ఆదాయం కూడా అదేస్థాయిలో పెరిగింది.

ఈ ఒక్క నెలలోనే తెలంగాణలో దాదాపు 25 శాతానికి పైగా బీర్స్ అమ్ముడయ్యాయి. ఇక బీర్ల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఒక్కో బాటిల్‌ పైన10 రూపాయల వరకు తగ్గించారు. ధరల తగ్గింపు కంటే కోవిడ్‌ భయం తొలగిపోవడం వల్లనే వినియోగం పెరిగిందని, దసరా కారణంగా బీర్స్ అమ్మకాలు పెరుగుతాయని అంటున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తెలంగాణాలో 14వేల 320 కోట్ల అమ్మం అమ్మకాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా నుంచే 3వేల247 కోట్ల ఆదాయం వచ్చింది.. ఇక రెండో స్థానంలో ఉన్న నల్గొండ జిల్లాలో మద్యం అమ్మకాలపైన 1,599 కోట్ల ఆదాయం, తరువాత మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ నుంచి 1510 కోట్ల ఆదాయం వచ్చింది.

మొత్తంమీద కరోన కారణంగా చతికిల పడిన వ్యాపారాలన్నీ కోవిడ్ తీవ్రత తగ్గడంతో గాడిన పడుతున్నాయి. సరిగ్గా పండగల సమయానికి కోవిడ్ తగ్గడం కూడా వ్యాపారులకు కలిసి వచ్చింది.

రెండు రోజుల్లో 50 లక్షల చికెన్ తినేశారు

గ్రేటర్‌ పరిధిలో సాధారణంగా రోజుకు 10 లక్షల కిలోల Chicken వినియోగమవుతుంది. కాగా గురు, శుక్రవారాల్లో కలిపి దాదాపు 50 లక్షల కిలోల చికెన్‌ విక్రయాలు జరిగినట్లు హోల్‌సేల్‌  వ్యాపారులు చెప్పారు.హైద్రాబాద్ లో మటన్‌ ధర కిలో రూ. 750– 800  లకు విక్రయించారు. మటన్‌ కంటే చికెన్‌ ధర తక్కువ ఉన్న కారణంగా మాంసం ప్రియులు చికెన్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.. గత మూడ్రోజుల్లో మటన్‌ దాదాపు 10 నుంచి 15 లక్షల కిలోల విక్రయాలు జరిగినట్లు వ్యాపారుల అంచనా.

click me!