భట్టి విజ్ఞప్తికి స్పందించిన కేసీఆర్ సర్కార్.. ఇకపై ఆసుపత్రుల్లోనూ రూ.5 కే భోజనం

By Siva KodatiFirst Published Oct 15, 2021, 3:11 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5కే ఆహారం అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ఆసుపత్రుల పరిధిలో ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5కే ఆహారం అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ఆసుపత్రుల పరిధిలో ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం.. మొత్తం కలిపి కేవలం రూ.15కే పంపిణీ చేయనున్నారు. ‘హరే రామ హరే కృష్ణ మూవ్‌మెంట్‌’ సంస్థకు ఇందుకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. దీనివల్ల తెలంగాణ వ్యాప్తంగా రోజుకు 20 వేల మందికి లబ్ది చేకూరుతుందని భావిస్తున్నారు.

ఆహారంతో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులు బస చేసేందుకు వీలుగా వసతిగృహాలనూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. తొలుత హైదరాబాద్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని ప్రారంభించి, దశల వారీగా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులల్లోనూ ఈ వసతులను అమలు చేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆహార కేంద్రాలను, వసతిగృహాలను నెలకొల్పడానికి అవసరమైన స్థల పరిశీలన పూర్తయింది.

ALso Read:డయాలిసిస్ రోగులకు బస్‌పాస్ ఇవ్వండి: ప్రభుత్వానికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి

కాగా, హైదరాబాద్‌లోని (hyderabad) ఆసుపత్రుల వద్ద విపరీతమైన రద్దీ కారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జనం ఎండ, వానల్లో పడిగాపులు కాస్తున్నారని.. అలాంటి వారి కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత (clp leader) భట్టి విక్రమార్క (bhatti vikramarka) తెలంగాణ ప్రభుత్వాన్ని (telangana govt) కోరారు. అసెంబ్లీ సమావేశాల (telangana assembly sessions) సందర్భంగా ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. దాతలు ఆహారం పంపిణీ చేయడానికి వస్తే దాని కోసం బారులు తీరుతున్నారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం ఎంతో కష్టపడి తీసుకున్న తర్వాత కూర్చొని తినడానికి స్థలం, మంచినీటి వసతులు సైతం వుండటం లేదని భట్టి తెలిపారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేస్తే బాగుంటుందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.

1978లో కొనేరు రంగారావు (koneru ranga rao) సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా వున్నప్పుడు  భిక్షాటన చేసే వారి కోసం ప్రత్యేకంగా హాస్టల్స్ ఏర్పాటు చేశారిన ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమాన్ని తర్వాతి ప్రభుత్వాలు పక్కనబెట్టాయని విక్రమార్క అన్నారు. అన్ని జిల్లాల్లోనూ డయాలసిస్ (kidney dialysis) కార్యక్రమాన్ని ఉచితంగా అందిస్తున్నారని.. అయితే ఆసుపత్రులకు వెళ్లడానికి రవాణా ఖర్చులు పెట్టుకోలేకపోతున్నామని ప్రజలు తమకు చెబుతున్నారని  ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పేదలకు బస్ పాస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు

click me!