హనుమకొండలో పట్టపగలు సినీ ఫక్కీలో భారీ ఛోరీ.. కారు అద్దాలు పగలగొట్టి, క్షణాల్లో రూ. 25లక్షలు మాయం...

By AN Telugu  |  First Published Nov 16, 2021, 3:04 PM IST

ఆ సమయంలో బ్యాంకు నుంచి సంతకం కోసం ఫోన్ రావడంతో  కారును  లాక్ చేసి లోపలికి వెళ్లి తిరిగి వచ్చాడు. అప్పటికే కారు అద్దాలు పగిలి ఉన్నాయి. పరిశీలించగా Carలో పెట్టిన డబ్బులు మాయం అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.  భూమి కొనుగోలు కోసం బ్యాంక్ లో ఉన్న డబ్బులను తీసినట్లు తిరుపతి కన్నీటిపర్యంతమయ్యారు.


వరంగల్ : అత్యంత రద్దీగా ఉండే నగరంలోని నక్కలగుట్ట ప్రాంతంలో పట్టపగలే సినీ ఫక్కీలో చోరీ జరిగింది.  సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో నక్కలగుట్ట లోని హెచ్ డిఎఫ్ సి బ్యాంకు ముందు నిలిపి ఉంచిన  కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న 25 లక్షల రూపాయల నగదును దుండగులు అపహరించారు. 

సుబేదారి ఇన్స్పెక్టర్ ఏ రాఘవేంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ప్రకాష్ రెడ్డి పేటకు చెందిన కొండ బత్తుల తిరుపతి Real estate business చేస్తుంటాడు. తన ఇద్దరు కుమారులతో కలిసి హంటర్ రోడ్డు లోని ఎస్బిఐ బ్యాంకు కి వెళ్ళాడు.

Latest Videos

చిన్న కుమారుడు కృష్ణవంశీ  తన అకౌంట్ నుంచి రూ. ఐదు లక్షలు డ్రా చేసి తండ్రికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పెద్ద కుమారుడితో కలిసి నక్కలగుట్టలోని HDFC Bankకు వెళ్లిన తిరుపతి తన అకౌంట్ లో ఉన్న పది లక్షలు,  తన భార్య భాగ్యలక్ష్మి పేరుమీద ఉన్న ఐదు లక్షలు, పెద్ద కుమారుడు సాయి తేజ అకౌంట్ లో ఉన్న ఐదు లక్షలు డ్రా చేశాడు.  మొత్తం డబ్బును బ్యాగులో సర్దగా, పెద్ద కుమారుడు తీసుకెళ్లి బ్యాంకు ముందు పార్కు చేసిన కారు లో పెట్టాడు.

సిరిసిల్లలో ఘోరప్రమాదం... మానేరు వాగులో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి, ముగ్గురు సురక్షితం (వీడియో)

ఆ సమయంలో బ్యాంకు నుంచి సంతకం కోసం ఫోన్ రావడంతో  కారును  లాక్ చేసి లోపలికి వెళ్లి తిరిగి వచ్చాడు. అప్పటికే కారు అద్దాలు పగిలి ఉన్నాయి. పరిశీలించగా Carలో పెట్టిన డబ్బులు మాయం అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.  భూమి కొనుగోలు కోసం bankలో ఉన్న డబ్బులను తీసినట్లు తిరుపతి కన్నీటిపర్యంతమయ్యారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన డిసిపి
సంఘటన స్థలాన్ని సెంట్రల్ జోన్ డిసిపి  పుష్పరెడ్డి పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు.  బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు Accused  వచ్చి రేక్కి నిర్వహించినట్లు గా గుర్తించారు.  ఒకరు చోరీ చేసి బ్యాగ్ తో ముందుకు వెళ్ళగా మరో నిందితుడు ద్విచక్రవాహనంపై వచ్చి తీసుకెళ్లినట్లు డీసీపీ తెలిపారు. 

Bandi Sanjay: తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి.. నిన్న 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి.. బండి సంజయ్

నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను  ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  డిసిపి వెంట కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ టాస్క్ఫోర్స్ బృందాలు ఉన్నాయి. 

click me!