హైదరాబాద్‌లో పట్టుబడుతున్న హవాలా సొమ్ము.. తాజాగా రూ.1.27 కోట్ల నగదు పట్టివేత

By Siva KodatiFirst Published Nov 2, 2022, 8:35 PM IST
Highlights

హైదరాబాద్‌లో గత కొన్నిరోజుల నుంచి భారీగా హవాలా మొత్తం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం నారాయణగూడలో రూ1.27 కోట్ల నగదును టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో గత కొన్నిరోజుల నుంచి భారీగా హవాలా మొత్తం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం నారాయణగూడలో రూ1.27 కోట్ల నగదును టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్నివ వివరాలు తెలియాల్సి వుంది. 

ఇకపోతే... మునుగోడు ఎన్నిక తేదీ దగ్గరపడుతున్న కొద్దీ పోలీసులు బందోబస్తు తీవ్రం చేశారు. పోలీసులు తనిఖీల్లో రోజుకు కోట్ల కొద్దీ నగదు బయటపడుతోంది. మంగళవారం జూబ్లీహిల్స్ లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ . 22లో తనిఖీలు నిర్వహించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ వ్యక్తి నుంచి 89.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు మునుగోడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థికి చేరవేసేందుకు డబ్బులు తీసుకు వెళుతూ పట్టుబడిన వ్యక్తి పోలీసులకు వెల్లడించారు. 

ALso REad:మునుగోడు బీజీపీ అభ్యర్థి కోసం భారీగా హవాలా సొమ్ము.. జూబ్లీహిల్స్ లో స్వాధీనం...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షామీర్పేట్ సమీపంలోని పూడూరుకు చెందిన కడారి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 82లోని త్రిపుర కన్స్ట్రక్షన్స్ కార్యాలయం నుంచి రూ.89.92 లక్షలు తీసుకుని టీఎస్ 27డి7777 థార్  కారులో వెళ్తున్నాడు. భారతీయ విద్యా భవన్ స్కూల్ సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు  అతడిని పట్టుకున్నారు. బ్యాగుల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు  కనిపించడంతో విచారించగా శ్రీనివాస్ నుంచి సరైన సమాధానం రాలేదు. డబ్బుకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పచెప్పారు. 
 

click me!