
హైదరాబాద్ : వరంగల్ రైల్వే స్టేషన్‌లో శనివారం కదులుతున్న రైలులో నుంచి దిగేందుకు ప్రయత్నించిన ఓ మహిళా ప్రయాణికురాలు ప్రమాదవశాత్తు జారి రైలు కింద పడింది. ఆమె ప్రాణాలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) కానిస్టేబుల్ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి, కాపాడాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్రాచలం-సికింద్రాబాద్ మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలు రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై ఆగబోతుండగా, ప్రయాణికురాలు తన లగేజీని పట్టుకుని దిగేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో, ఆమె జారి ప్లాట్‌ఫారమ్‌పై పడిపోయింది.
‘సంస్కారవంతమైన పిల్లల’ కోసం రామాయణం చదవండి.. గర్భిణీలకు తెలంగాణ గవర్నర్ సలహా...
దీన్ని ప్లాట్‌ఫారమ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ సోనాలి మరోటి మోలాక్ గమనించాడు. వెంటనే ఆ ప్రయాణికురాలికి సహాయం చేయడానికి పరిగెత్తాడు. ఆమె రైలు కిందికి వెళ్లకుండా ప్లాట్‌ఫారమ్‌పైకి సురక్షితంగా లాగాడు. సోనాలి అసాధారణ ప్రయత్నాన్ని, రైలు పట్టాలపై పడకుండా ప్రయాణీకురాలిని వేగంగా పట్టుకుని లాగి.. ధైర్య సాహసాలు కనబరిచాడని రైల్వే అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, నిరుడు ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కదులుతున్న రైల్లోంచి ఓ యువకుడు హడావుడిగా దిగబోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. దిగే క్రమంలో రైలుకు, ప్లాట్ ఫాం కు మధ్యలో వ్యక్తి ఇరుక్కుపోయాడు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అతడి ప్రాణాలు కాపాడారు.
వివరాల్లోకి వెడినే.. ప్రకాశం జిల్లాకు చెందిన రవికుమార్ రైల్లో బేతంచర్లకు బయలుదేరాడు. రైలు ఎక్కిన తరువాత నిద్రపోవడంతో దిగవలసిన స్టేషన్ లో దిగలేకపోయాడు. ఒక్కసారిగా మెలుకువ వచ్చి చూసేసరికి తాను దిగాల్సిన స్టేషన్ వెళ్లిపోయింది. దీంతో అతడు గిద్దలూరు రైల్వేస్టేషన్ లో కదులుతున్న ట్రైన్ దిగడానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలోనే కాలుజారి అతడు ప్లాట్ ఫాం, రైలుకు మద్య ఇరుక్కుపోయాడు. తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవించాడు. అయితే రైల్వే సిబ్బంది ప్లాట్ ఫాం ను పగలగొట్టి అతడిని కాపాడారు. అతడిని వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడు క్షేమంగానే వున్నట్లు తెలుస్తోంది.