‘సంస్కారవంతమైన పిల్లల’ కోసం రామాయణం చదవండి.. గర్భిణీలకు తెలంగాణ గవర్నర్ సలహా...

By SumaBala Bukka  |  First Published Jun 12, 2023, 12:21 PM IST

గైనకాలజిస్ట్, ఫీటల్ థెరపిస్ట్ కూడా అయిన తెలంగాణ గవర్నర్ తమిళిసౌ సౌందరరాజన్, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ 'గర్భ సంస్కార్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.


హైదరాబాద్ : ‘సంస్కారవంతమైన పిల్లలు’ కావాలంటే గర్బిణీలు రామాయణం చదవాలంటూ తెలంగాణ గవర్నర్, గైనకాలజిస్ట్, ఫీటల్ థెరపిస్ట్ అయిన తమిళిసై సూచించారు. గర్భిణులు తమ పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా జన్మించేందుకు రామాయణంలో 'సుందర్కాండ' పఠించాలని అన్నారు. 'గర్భ సంస్కార మాడ్యూల్' అనే కార్యక్రమం ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ వర్చువల్ గా పాల్గొన్నారు. వర్చువల్ లాంచ్ సందర్భంగా, వివిధ దశల్లో ఉన్న గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రామాయణం వంటి ఇతిహాసాలు చదివే తల్లులను గ్రామాల్లోనే చూశామని, సంపూర్ణ ఆరోగ్యంలో భాగంగా గర్భిణులు మానసికంగా, శారీరకంగా దృఢంగా బిడ్డలు కనేందుకు సుందరకాండ పఠించాలన్నారు. సంవర్ధినీ న్యాస్ అభివృద్ధి చేసిన 'గర్భ సంస్కార్' కార్యక్రమం కింద, సంస్థకు సంబంధించిన వైద్యులు 'శాస్త్రీయ, సాంప్రదాయ' ప్రిస్క్రిప్షన్‌ల మిశ్రమాన్ని కాబోయే తల్లులకు అందిస్తారు, తద్వారా వారు 'సంస్కారి, దేశభక్త' శిశువులకు జన్మనిస్తారు.

Latest Videos

undefined

పెద్దల ముందే వదినను కొబ్బరి బోండాల కత్తితో నరికి చంపాడు...

ఈ ప్రిస్క్రిప్షన్‌లలో భగవద్గీత వంటి మతపరమైన గ్రంథాలను చదవడం, సంస్కృత మంత్రాలను పఠించడం, యోగా సాధన వంటివి ఉంటాయి. ఈ ప్రక్రియ గర్భధారణకు ముందు ప్రారంభమవుతుంది. ప్రసవ దశ వరకు ఉండి..  శిశువుకు రెండేళ్ల వయస్సు వచ్చే వరకు కొనసాగుతుంది. వర్చువల్‌గా ప్రారంభించిన 'గర్భ సంస్కార్' మాడ్యూల్ ప్రకారం, కాబోయే తల్లుల కుటుంబ సభ్యులు కూడా ప్రోగ్రామ్ సమయంలో మార్గనిర్దేశం చేయబడతారు.

"తల్లుల మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. గ్రామాల్లో తల్లులు రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, మంచి కథలు చదవడం చూశాం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కంభన్ రామాయణంలోని సుందరకాండను నేర్చుకోవాలని తమిళనాడులో ఒక నమ్మకం ఉంది. రామాయణం తమిళ వెర్షన్. సుందర్కాండ్ హనుమంతుని అద్భుతం కాబట్టి ఇది శిశువుకు చాలా మంచిది. కాబట్టి, ఇవన్నీ గర్భం సమయంలో వచ్చే కాంప్లికేషన్లను నిరోధిస్తుందన్నారు. దీనివల్ల తల్లీ, బిడ్డల ఆరోగ్యం బాగుంటుందని, వారికి మంచిదని అన్నారు. సంవర్ధినీ న్యాస్ అనేది రాష్ట్ర సేవికా సంఘ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కి సమాంతరంగా ఉండే మహిళా సంస్థ.

click me!