బర్త్‌డే వేడుకల్లో నిజామాబాద్ రౌడీ షీటర్ హల్‌చల్: గన్‌తో గాల్లోకి కాల్పులు

Published : Aug 12, 2021, 04:33 PM IST
బర్త్‌డే వేడుకల్లో నిజామాబాద్ రౌడీ షీటర్ హల్‌చల్: గన్‌తో గాల్లోకి కాల్పులు

సారాంశం

బర్త్‌డే వేడుకల్లో ఓ రౌడీ షీటర్ తుపాకీతో గాల్లోకి  కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవలనే జైలు నుండి బయటకు వచ్చిన అతను తన పద్దతిని మార్చుకోలేదు.ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో  రౌడీషీటర్ బర్త్‌డే వేడుకల్లో గన్‌తో వీరంగం సృష్టించాడు. మూడు రౌండ్లు ఆయన  గాలిలోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు.

 నిజామాబాద్ పట్టణ శివారులోని  సారంగపూర్‌ లోని ఫామ్‌హౌజ్ లో ఈ ఘటన చోటు చేసుకొంది. పీడీ యాక్ట్‌పై అరెస్టై ఇటీవలనే ఆ రౌడీషీటర్ విడుదలయ్యాడు. కారు బానెట్‌పై కూర్చొని ఉన్న సమయంలో అనుచరుడు అందించిన తుపాకీని చేతబూని గాల్లోకి కాల్పులు జరిపాడు. 

ఫామ్‌హౌజ్‌లో జరిగిన బర్త్‌డే వేడుకల్లో రౌడీ షీటర్ కాల్పులు జరిపినట్టుగా  పోలీసులు చెబుతున్నారు. జైలుకు వెళ్లి వచ్చినా కూడ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు.  రౌడీ షీటర్ కూర్చొన్న కారుపై కూడ పలు చలాన్లున్నాయి. రాష్ డ్రైవింగ్ కింద 22 చలాన్లున్నట్టుగా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్  కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ ని విచారణాధికారిగా నియమించారు.

గత నెలలో ఓ వ్యక్తి పుట్టినరోజున తల్వార్ తో హంగామా చేశాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడ వైరల్ గా మారింది. దీంతో పోలీసులు విచారించి నిందితుడిని అరెస్ట్ చేశారు.


 

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు