గాంధీ భవన్ కు రోశయ్య పార్థీవ దేహం: నివాళులర్పించిన మల్లిఖార్జున ఖర్గే

Published : Dec 05, 2021, 12:35 PM ISTUpdated : Dec 05, 2021, 12:59 PM IST
గాంధీ భవన్ కు రోశయ్య పార్థీవ దేహం: నివాళులర్పించిన మల్లిఖార్జున ఖర్గే

సారాంశం

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్థీవ దేహన్ని గాంధీ భవన్ కు తరలించారు. రోశయ్య భౌతిక కాయానికి కాంగ్రెస్ పార్టీ నేతలు నివాళులర్పించారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే రోశయ్య మృతదేహనికి  నివాళులర్పించారు. 


హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్థీవ దేహన్ని గాంధీ భవన్ కు తరలించారు. ఆదివారం నాడు ఉదయం రోశయ్య నివాసం నుండి  గాంధీ భవన్ కు తీసుకొచ్చారు. గాంధీ భవన్ లో congress పార్టీ నేతలు రోశయ్యకు నివాళులర్పించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత mallikarjun kharge రోశయ్య పార్థీవ దేహనికి నివాళులర్పించారు. న్యూఢిల్లీ నుండి మల్లిఖార్జున ఖర్గే హైద్రాబాద్ కు చేరుకొన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఆయన  గాంధీ భవన్ కు చేరుకొని రోశయ్య మృతదేహానికి నివాళులర్పించారు. శనివారం నాడు Rosiahమరణించిన విషయం తెలిసిందే.

also read:మా మధ్య రాజకీయ వైరుధ్యమే ఉంది: రోశయ్యకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఇవాళ మధ్యాహ్నం రోశయ్య అంత్యక్రియలు కొంపల్లి ఫాంహౌస్ లో నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం  రోశయ్య అంత్యక్రియలను  అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.రోశయ్య చాలా కాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ఆర్ధిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు వదులుకొన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రోశయ్యకు గవర్నర్ పదవిని అప్పగించింది. తమిళనాడు రాష్ట్రానికి రోశయ్య  గవర్నర్ గా కొనసాగారు. రోశయ్య కు  పలు పార్టీల ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి సహా పలువురు రోశయ్య  బౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. 

గాంధీ భవన్ నుండి రోశయ్య డెడ్‌బాడీని కొంపల్లి ఫాంహౌస్ కు తరలించారు. ఈ ఫాంహౌస్ లోనే తన అంత్యక్రియలను నిర్వహించాలని రోశయ్య కుటుంబ సభ్యులకు చెబుతుండేవారని.. ఆయన కోరిక మేరకే ఈ ఫాం హౌస్ లో రోశయ్య అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ ఫాం‌హౌస్ కు వచ్చిన సమయంలో ఇక్కడ పనిచేసే వారితో రోశయ్య ఆప్యాయంగా పలకరించేవారు. ఫాం హౌస్ మొత్తం ఆయన కలయ తిరిగేవారు.  ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే వన భోజనాలను కూడా ఈ ఫాం హౌస్ లో ఆయన నిర్వహించేవారు. ఈ ఫాం హౌస్ లో  ఈ ఏడాది నిర్వహించిన వన భోజనాలకు రోశయ్య హాజరు కాలేదు. నడవలేని స్థితి కారణంగా ఆయన వన భోజనాలకు దూరంగా ఉన్నారు. అయితే గత ఏడాది నిర్వహించిన వన భోజనాలకు రోశయ్యహాజరయ్యారు. తెలంగాణ సీఎం సహా పలువురు మంత్రులు రోశయ్య  బౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. పలు పార్టీల నేతలు కూడా రోశయ్యను అజాత శతృవుగా పేర్కొన్నారు. 

 తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, తమిళనాడు గవర్నర్  ఆర్ఎన్ ర‌వి, సీఎం ఎంకే స్టాలిన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ సాకె శైలజనాథ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలంగాణ, ఏపీలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. 
 


 

PREV
click me!

Recommended Stories

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన నారా భువనేశ్వరి Nara Bhuvaneshwari Pays Tribute At NTR
NTR 103rd Jayanti: ఎన్టీఆర్ 103వ జయంతి నివాళి అర్పించిన లక్ష్మీ పార్వతి | Asianet News Telugu