నోట్లు కిందపడేసి, బ్యాంక్ సిబ్బందికి మస్కా: 70 లక్షలు చోరీ

Siva Kodati |  
Published : May 07, 2019, 12:38 PM IST
నోట్లు కిందపడేసి, బ్యాంక్ సిబ్బందికి మస్కా: 70 లక్షలు చోరీ

సారాంశం

హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ దోపిడీ జరిగింది. సినీ ఫక్కీలో బ్యాంక్ సిబ్బందికి మస్కా కొట్టి రూ. 70 లక్షలు దోచుకెళ్లారు.

హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ దోపిడీ జరిగింది. సినీ ఫక్కీలో బ్యాంక్ సిబ్బందికి మస్కా కొట్టి రూ. 70 లక్షలు దోచుకెళ్లారు.

ఉదయం యాక్సిస్ బ్యాంక్‌లో డబ్బులు పెట్టడానికి సిబ్బంది వచ్చారు. ఈ క్రమంలో అప్పటికీ మాటు వేసిన దోపిడి గ్యాంగ్ బ్యాంక్ సిబ్బంది అక్కడికి రాగానే కొన్ని నోట్లు రోడ్డుపై పారేశారు.

దీంతో సిబ్బంది వాటిని తీసుకుంటుండగా సుమోలోంచి రూ.70 లక్షలతో కూడిన బ్యాగ్‌ను ఎత్తుకెళ్లింది. దీంతో బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.. మరింత పెరుగుతాయా?
Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో