తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

Siva Kodati |  
Published : May 07, 2019, 12:18 PM IST
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

సారాంశం

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ్టీ నుంచి మే 14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే 17 కాగా, మే 31న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఎమ్మెల్సీలుగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యులుగా గెలుపొందగా, కొండా మురళీ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇవి ఖాళీ అయ్యాయి.

అయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు. మరో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?
Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!