సిరిసిల్ల: తాళం వేసి వివాహానికి.. తిరిగొచ్చి చూస్తే అవాక్కు, పెళ్లికుమార్తె ఇంట్లో భారీ చోరీ

Siva Kodati |  
Published : Nov 10, 2021, 10:21 PM IST
సిరిసిల్ల: తాళం వేసి వివాహానికి.. తిరిగొచ్చి చూస్తే అవాక్కు, పెళ్లికుమార్తె ఇంట్లో భారీ చోరీ

సారాంశం

సిరిసిల్ల (siricilla) పట్టణంలో దోపిడి దొంగలు (robbery) బీభత్సం సృష్టించారు. స్థానిక నెహ్రూ నగర్‌లో పెళ్లి ఇంట్లోకి చొరబడిన దొంగలు 10 తులాల బంగారం, 30 తులాల వెండి డైమండ్ రింగ్ తో పాటు 4 లక్షల 30 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. 

సిరిసిల్ల (siricilla) పట్టణంలో దోపిడి దొంగలు (robbery) బీభత్సం సృష్టించారు. స్థానిక నెహ్రూ నగర్‌లో పెళ్లి ఇంట్లోకి చొరబడిన దొంగలు 10 తులాల బంగారం, 30 తులాల వెండి డైమండ్ రింగ్ తో పాటు 4 లక్షల 30 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. దూస సత్యనారాయణ కుమార్తె వివాహం స్థానిక భవాని ఫంక్షన్ హాల్‌లో జరుగుతుంది. ఇదే అదునుగా భావించిన దొంగలు..  సత్యనారాయణ ఇంట్లో బీరువా తాళాలు పగలగొట్టి మొత్తం ఊడ్చుకెళ్లారు. పెళ్లి అయిపోయాక ఇంటికి వ‌చ్చిన వ‌ధువు, ఆమె కుటుంబ స‌భ్యులు దొంగ‌త‌నం జ‌రిగింద‌ని తెలిసి షాక‌య్యారు. వెంటనే పెళ్లి కుమార్తెతో పాటు కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చోరీ జ‌రిగిన తీరును పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

"

PREV
click me!

Recommended Stories

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి CM రేవంత్ రెడ్డి బోనాలు | Secunderabad Ujjaini Mahankali Bonalu 2026
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం | First Darshan of Ujjaini Mahankali Temple | Bonalu 2026