శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి, శకలాల కింద మరో ఆరుగురు

Siva Kodati |  
Published : Apr 18, 2021, 07:49 PM IST
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి, శకలాల కింద మరో ఆరుగురు

సారాంశం

శంషాబాద్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. 15 మందికిపైగా గాయపడ్డారు. 

శంషాబాద్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. 15 మందికిపైగా గాయపడ్డారు.

శంషాబాద్‌ మార్కెట్‌ నుంచి వ్యాపారులు కూరగాయలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో లారీలో సుమారు 30 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు వ్యాపారులు లారీ కింద చిక్కుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 
PREV
click me!

Recommended Stories

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు