
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కడ్తాల్‌లోని మైసిగండి దేవాలయానికి వెళ్లిన కొందరు యువకులు కారులో తిరిగి వస్తున్న సమయంలో కందుకూరు మండలం దెబ్బడగూడ వద్ద ప్రమాదానికి గురయ్యారు.
ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను వీరి కారు వెనుక నుంచి ఢీకొట్టి పక్కనే ఉన్న కరెంట్ స్తంభంవైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు.
వారిలో వినోద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తుండగా... శివకుమార్ నారాయణగూడ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న ఘటనాస్థలికి చేరకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.