ఔటర్‌పై ప్రమాదం..లాంగ్ ట్రిప్‌కి వెళ్లొస్తూ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ దుర్మరణం

sivanagaprasad kodati |  
Published : Sep 28, 2018, 11:05 AM IST
ఔటర్‌పై ప్రమాదం..లాంగ్ ట్రిప్‌కి వెళ్లొస్తూ..  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ దుర్మరణం

సారాంశం

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించారు. వరంగల్‌కు చెందిన భరత్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నాడు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించారు. వరంగల్‌కు చెందిన భరత్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో కారులో కుటుంబాన్ని తీసుకుని విహారయాత్రకు వెళ్లాడు.. తిరుపతి, ఒంగోల్, వరంగల్‌లో సరదాగా గడిపి.. తిరిగి నగరానికి బయలుదేరాడు. నిన్న అర్థరాత్రి హిమాయత్ సాగర్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్‌ వద్ద అతను ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి.. డివైడర్ పైకి దూసుకెళ్ళింది.

ఈ ప్రమాదంలో భరత్ కుమార్ రెడ్డి అక్కడికక్కడే మరణించగా.. అతని భార్య అనురాధ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అతని కుమారుడిని మార్గమధ్యంలో వరంగల్‌లోనే వదిలి పెట్టడంతో ఆ చిన్నారి ప్రమాదం నుంచి బయట పడ్డాడు..

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు