మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ చౌరస్తాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ చౌరస్తాలో ఆగి ఉన్న ఆటోను డీసీఎం ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి
మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లాలోని బాలానగర్ చౌరస్తాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ అతివేగంతో వచ్చి ఆగి ఉన్న ఆటో, బైక్‌ని ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి, వారి పరిస్థితి విషమంగా ఉంది. దీనితో ఆగ్రహించిన జనం లారీకి నిప్పుపెట్టి, రోడ్డుపై నిరసన తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. బాలానగర్ చౌరస్తాలో ప్రతి శనివారం సంత జరుగుతుంది. కూరగాయలు, ఇతర వస్తువులు అమ్మేవాళ్లు,కొనేవాళ్లతో అక్కడ ప్రాంతమంతా బిజీబిజీగా ఉంటుంది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తున్న ఆటో, మోటార్ సైకిల్ ను హైదరాబాద్ నుంచి వస్తున్న డీసీఎం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందారు. మృతులను రాజాపూర్ మండలం బీబీనగర్ తండాకు చెందిన ఫనీ (50), ఆమె మనువరాలు జున్ను (3), మోతి ఘనపూర్ కు చెందిన సునీత (32), ఆమె కూతురు పింకీ (8), బాలానగర్ కు చెందిన జస్వంత్ లుగా గుర్తించారు. గాయపడిన మౌనిక అనే మహిళను జిల్లా ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్న భద్ర సింగ్ అనే వ్యక్తిని మెరుగైన వైద్యం కోసంహైదరాబాద్ కు తరలించారు.
undefined
ఢిసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని వాహనాన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. ఘటన స్థలానికి వచ్చిన జడ్చర్ల రూరల్ సీఐ, బాలానగర్ ఎస్‌ఐను ఆందోళనకారులు షాపులో నిర్బంధించారు. సంత నాడు ట్రాఫిక్ నిర్వహణ సరిగా చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.బాలానగర్ చౌరస్తాకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీలు సంఘటన స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండలంలో 144 సెక్షన్ విధించారు. కాగా జిల్లా ఆసుపత్రికి కలెక్టర్ రవి నాయక్ చేరుకొని గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.