గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. 4 కార్లు, 2 బైక్ల మీదికి దూసుకెళ్లిన టిప్పర్.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు..

Published : Dec 26, 2022, 06:43 AM IST
గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. 4 కార్లు, 2 బైక్ల మీదికి దూసుకెళ్లిన  టిప్పర్.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు..

సారాంశం

హైదరాబాద్  గచ్చిబౌలిలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. 

హైదరాబాద్ : హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ దగ్గర టిప్పర్ బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడడంతో ఆగిన కార్లు బైకులు మీదికి దూసుకెళ్లింది.  ఈ ప్రమాదంలో నాలుగు కార్లు, రెండు బైకులు నుజ్జు నుజ్జు అయ్యాయి. అంతేకాదు ఐదుగురు గాయపడ్డారు. ఒకరు మృతి చెందారు. టిప్పర్ గుద్దడంతో  ప్రమాదం జరిగిన స్థలంలోనే   నజీర్  అనే స్విగ్గి డెలివరీ బాయ్ అక్కడికక్కడే  మృతి చెందాడు. అబ్దుల్ అనే ఒక విద్యార్థికి  కాలు విరిగింది. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు చేరవేశారు.  వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా టిప్పర్ వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని.. దాని వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం