ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బైకులు ఢీ.. ఇద్దరు చిన్నారులతో నలుగురు మృతి

Published : Dec 26, 2022, 02:26 AM ISTUpdated : Dec 26, 2022, 02:46 AM IST
 ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బైకులు ఢీ.. ఇద్దరు చిన్నారులతో నలుగురు మృతి

సారాంశం

 ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాంసి మండలం హస్నాపూర్ లో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

 

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైక్‌లు ఒక్కదాని ఒక్కటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ఈ విచారకర ఘటన ఆదిలాబాద్ తాంసి మండలంలోని హాసనాపూర్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహారాష్ట్రలోని కిన్వాట్ జిల్లా అందుబొరి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారిని ఆదిలాబాద్‌ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారిలో ఒకరూ చికిత్స పొందుతూ.. ప్రాణాలు కోల్పోయారు. 


వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని కిన్వాట్ జిల్లా అందుబొరి గ్రామానికి చెందిన సుజీత్ (56), వందన  దంపతులు . వారి పిల్లలు కూతురు మనీషా (15), కుమారుడు సంస్కార్(11)లతో  కలిసి ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.  మరోవైపు.. మహారాష్ట్రలోని యవట్ మల్ తాలుకా మజ్జి గ్రామానికి చెందిన నారాయణ (38) సింకిడి మీదుగా ఆదిలాబాద్ కు బయలు దేరారు.

ఈ క్రమంలో  ఆదిలాబాద్ తాంసి మండలంలోని హాసనాపూర్ వద్ద  రెండు దిచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మహారాష్ట్రలోని కిన్వాట్ జిల్లా అందుబొరి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. తల్లి వందనకు, నారాయణకు తీవ్రగాయాలు కాగా.. వారిని ఆదిలాబాద్‌ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ.. నారాయణ ప్రాణాలు కోల్పోయారు.  వందన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్