బీజేపీకి ఎవరి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదు.. చంద్రబాబు సభపై ఈటల కామెంట్స్

By Siva KodatiFirst Published Dec 25, 2022, 9:45 PM IST
Highlights

టీడీపీని తెలంగాణలో బలోపేతం చేస్తామంటూ చంద్రబాబు నాయుడు ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్. తమ పార్టీకి ఎవరి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదన్నారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ఖమ్మంలో సభ పెట్టడం.. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో టీడీపీ లేదన్న వాళ్లకు ఈ సభే సమాధానమన్నారు. దీని తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేశారు. తాజాగా దీనిపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. తెలుగుదేశాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని గతంలోనే చంద్రబాబు ప్రకటించారని గుర్తుచేశారు. టీడీపీ ఏం నిషేధించిన పార్టీయే లేదా కొత్త పార్టీయో కాదన్న ఈటల.. ఈ పార్టీకి తెలంగాణ వాసన, పునాదీ వుందన్నారు. ఇక బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా అన్న ప్రశ్నకు రాజేందర్ స్పందిస్తూ.. తాము ఎవరి దయా దాక్షిణ్యం మీద ఆధారపడలేదన్నారు. కేసీఆర్‌ను బొందపెట్టాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని... రాష్ట్రంలో అనేక దుర్మార్గాలు జరుగుతున్నాయని ఈటల రాజేందర్ అన్నారు. ఎంతటివారైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. 

అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాలు తెలంగాణలో చెల్లవన్నారు. టీడీపీకి మళ్లీ ప్రాణం పోయాలనుకుంటే ప్రజలు తిరస్కారిస్తారని చెప్పారు. చుక్కలు ఎన్ని ఉన్నా చందమామ ఒక్కటే ఉన్నట్టే.. ఎన్ని పార్టీలు వచ్చినా తెలంగాణలో కేసీఆర్ ఒక్కరే ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటుగా మరెవరూ కూడా ఇక్కడి ప్రజలకు శ్రేయస్సు కాదని అన్నారు. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన సమయంలో తీసుకుంటారని చెప్పారు. 

Also REad: తెలంగాణలో టీడీపీ లేదన్నవాళ్లకు ఖమ్మం సభే సమాధానం: చంద్రబాబు

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ ప్రజలే పాలన బాగోలేదని చిత్తుచిత్తుగా  ఓడించారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనలో తెలంగాణ ప్రాంతం అత్యంత దోపిడికి, నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు హయాంలో అతి ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయని విమర్శించారు. 

ఆంధ్రలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు కూడా చంద్రబాబుకు లేదన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడటమంటే.. చెట్టు పేరు చెప్పుకుని కాయాలు అమ్ముకోవడమేనని అన్నారు. ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఎన్టీఆర్ పెట్టినప్పుడు ఉన్న పార్టీ కాదని అన్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏం చేశాడో తెలుగు ప్రజలు తెలియనది కాదు కదా అని అన్నారు. చంద్రబాబు తెలంగాణలో ఎన్ని డ్రామాలు చేసిన ఆయనకు ఒరిగేదేమి లేదన్నారు

click me!