ముగ్గురు మిత్రుల కథ: మరణంలోనూ వీడని బంధం

Published : Dec 10, 2018, 07:51 AM ISTUpdated : Dec 10, 2018, 10:04 AM IST
ముగ్గురు మిత్రుల కథ: మరణంలోనూ వీడని బంధం

సారాంశం

భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.  బైకు చెట్టునలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అశ్వారావుపేట మండటం నందిపాడు గ్రామానికి చెందిన కిశోర్ బాబు, కారం వీరభద్రం, జోగారావు,  ముక్తేశ్వరరావు మిత్రులు వీరంతా కలిసి ఆదివారం ఒకే బైక్‌పై వూరికి దగ్గర్లోని కుడుములపాడు వెళ్లి అల్పాహారం తీసుకున్నారు.

పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు మలుపు వద్ద వీరి బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. దీనిని గమనించిన గ్రామస్తులు అశ్వారావుపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ కిశోర్, వీరభద్రం, జోగారావు మరణించగా.. ముత్తేశ్వరరావు అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో వీరభద్రానికి వివాహం కాగా, ఏడాదిన్నర వయసున్న కుమార్తె, భార్య ఉన్నారు.

కిశోర్, జోగారావులకు ఇంకా పెళ్లి కాలేదు. మరణించిన ముగ్గురు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు... కిశోర్ అశ్వారావుపేటలో బీఈడీ చదువుతుండగా... వీరభద్రం బీఈడీ పూర్తి చేసి ప్రస్తుతం క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. జోగారావు పోలవరం ప్రాజెక్ట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ముగ్గురు మిత్రులు ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu