ఆదివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కంటైనర్ ను ఢీ కొట్టడంతో అందులోని నలుగురు మృతి చెందారు.
ఆదిలాబాద్ : కంటైనర్ ను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం వద్ద ఆదివారం రాత్రి జరిగింది. హైదరాబాద్ నుంచి అదిలాబాద్ వెళ్తున్న కారు ఓ కంటైనర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పురుషులు, ఒక మహిళ మృతి చెందారు మరొక మహిళ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. మృతులను అదిలాబాద్ వాసులుగా గుర్తించారు.
ఇదిలా ఉండగా, కర్ణాటకలోని హసన జిల్లాలో అక్టోబర్ 15న అర్థరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. 14 మంది గాయపడ్డారు. హళ్లికెరెకు చెందిన 14 మంది ట్రావెలర్ ను అద్దెకు తీసుకుని తీర్థయాత్రలకు వెళ్లారు. హసనకు చేరుకుని హసనాంబ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మరో పావుగంటలో స్వగ్రామం చేరుకోవాల్సి ఉండగా జాతీయ రహదారి-69పై ఎదురుగా వచ్చిన పాల టాంకర్, టెంపో ట్రావెలర్ ను ఢీకొట్టింది.
అమ్ముడుపోయారంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు.. భగ్గుమన్న టీఎన్జీవో నేతలు, రేపు నిరసనలకు పిలుపు
వెనక వస్తున్న బస్సు.. ముందు ఢీకొట్టిన ట్యాంకర్ల మధ్య టెంపో ట్రావెలర్ నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో హళ్లికెరె గ్రామానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందారు. మృతులంతా సన్నిహిత బంధువులు. బస్సులో ఉన్నవారితో పాటు మొత్తం 14 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబ సభ్యులకు రెండు లక్షల పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి బొమ్మై అధికారులను ఆదేశించారు.