అబ్ధుల్లాపూర్‌మెట్‌: బైక్‌ను ఢీకొట్టి అమ్మవారి ఆలయం మీదకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి

Siva Kodati |  
Published : Dec 11, 2021, 05:58 PM IST
అబ్ధుల్లాపూర్‌మెట్‌: బైక్‌ను ఢీకొట్టి అమ్మవారి ఆలయం మీదకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి

సారాంశం

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలి వద్దకు రాగానే అదుపుతప్పి ఒక్కసారిగా బైక్‌పై వెళ్తున్న విద్యార్థిపైకి దూసుకెళ్లింది. అనంతరం రోడ్డుపక్కన ఉన్న మైసమ్మ అమ్మవారి ఆలయ ప్రహరీని ఢీ కొట్టి ఆగిపోయింది.

అబ్దుల్లాపూర్‌మెట్‌ జంక్షన్‌లో (abdullapurmet junction) శనివారం లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. జాతీయ రహదారిపై హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలి వద్దకు రాగానే అదుపుతప్పి ఒక్కసారిగా బైక్‌పై వెళ్తున్న విద్యార్థిపైకి దూసుకెళ్లింది. అనంతరం రోడ్డుపక్కన ఉన్న మైసమ్మ అమ్మవారి ఆలయ ప్రహరీని ఢీ కొట్టి ఆగిపోయింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడిని సిరిసిల్ల జిల్లాకు (sircilla district) చెందిన ప్రణయ్‌ గౌడ్‌ (20)గా గుర్తించారు. ఈ కుర్రాడు విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో (vignan engg college hyderabad) చదువుతున్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు