కరీంనగర్ లో అమానవీయ ఘటన... పబ్లిక్ బాత్రూంలో మహిళ డెలివరీ... మృతశిశువు అక్కడేవదిలి పరారు

Arun Kumar P   | Asianet News
Published : Dec 11, 2021, 05:18 PM ISTUpdated : Dec 11, 2021, 05:20 PM IST
కరీంనగర్ లో అమానవీయ ఘటన... పబ్లిక్ బాత్రూంలో మహిళ డెలివరీ... మృతశిశువు అక్కడేవదిలి పరారు

సారాంశం

కరీంనగర్ పట్టణంలో అమానుషం వెలుగుచూసింది. ఓ పసిగుడ్డు మృతదేహం పబ్లిక్ బాత్రూంలో బయటపడటం సంచలనంగా మారింది. 

కరీంనగర్: ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలీదుగానీ అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది. కరీంనగర్ (karimnagar) పట్టణంలోని ఓ పబ్లిక్ బాత్రూంలో పసిగుడ్డు మృతదేహం కలకలం రేపింది. ఎవరో గుర్తతెలియని మహిళ చిన్నారి మృతదేహాన్ని బాత్రూంలో వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇవాళ(శనివారం) ఉదయం బాత్రూంలోకి వెళ్లిన ఓ మహిళ చిన్నారి మృతదేహాన్ని చూడటంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది.    

కరీంనగర్ పట్టణంలోని రామ్ నగర్ చేపల మార్కెట్ సమీపంలో పబ్లిక్ బాత్రూం వుంది. ఇవాళ ఉదయం చేపలు విక్రయించడానికి వచ్చిన ఓ మహిళ బాత్రూం ఉపయోగించుకోడానికి  వెళ్లింది. అయితే ఓ బాత్రూం తలుపు తెరవగా అందులో ఓ చిన్నారి మృతదేహం (baby deadbody) కనిపించడంతో భయంతో బయటకు పరుగుపెట్టింది. కొద్దిసేపటికి తేరుకుని తోటి మహిళలకు విషయం తెలపడంతో వారు వాచ్ మెన్ కు సమాచారమిచ్చారు. అతడు వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. 

Video

దీంతో వాచ్ మెన్ నిర్వహకులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహం బాత్రూంలోకి ఎలా వచ్చిందన్న దానిపై వాచ్ మెన్ ను ప్రశ్నించారు. అయితే శుక్రవారం రాత్రి ఓ గుర్తుతెలియని మహిళ వచ్చిందని... ఇది ఆమె పనే అయివుంటుందని అనుమానం వ్యక్తం చేసాడు. కరీంనగర్ టౌన్ ఏసిపి శ్రీనివాసరావు  సంఘటన స్థలాన్ని పరిశీలించారు

read more  విజ‌య‌వాడ వెళ్లాల‌ని న‌ర్సును ఆఫీసుకు పిలిచి.. ఆపై...

ఎక్కడినుంచయినా చిన్నారి మృతదేహాన్ని తీసుకువచ్చి బాత్రూంలో పడేసారా... లేక అక్కడే మహిళ ప్రసవించి మృతశిశువును వదిలిపెట్టింది వెళ్లిందా అన్నది తేలాల్సి వుంది. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పబ్లిక్ బాత్రూంల దగ్గర్లోని సిసి కెమెరాల ఆధారంగా ఈ ఘోరానికి పాల్పడ్డ మహిళను కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  

read more  భర్తతో వివాహేతర సంబంధం.. పారిశుద్ధ్య కార్మికురాలిని గొంతుకోసి చంపిన భార్య..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఇలాంటి దారుణమే జ‌రిగింది. ఆడ‌పిల్ల పుట్టింద‌ని క‌న్న‌తల్లే 5 రోజుల శిశువును చంపేసింది. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న తాడికొండ మండ‌లం రావేల‌లో చోటు చేసుకుంది. 

వెంక‌ట సుబ్బ‌య్య లక్ష్మి దంపతులకు 16 సంవ‌త్స‌రాల క్రితం పెళ్లి అయ్యింది. వారికి ఒక కుమారుడు, ఇద్ద‌రు కుమ‌ర్తెలు ఉన్నారు. ఈ నెల 2వ తేదీన ల‌క్ష్మీ ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుట్టింద‌నే కార‌ణంతో 7వ తేదీన ఆ చిన్నారి గొంతులో ఏదో వేసి ఊపిరి ఆడకుండా చేసి చ‌నిపోయేలా చేసింది. పాప‌ను చూసి వ‌ద్దామ‌ని వెళ్లిన స్థానిక ఆశవ‌ర్క‌ర్ కు పాప చ‌నిపోయింద‌నే స‌మాధానం వ‌చ్చింది. దీంతో అనుమానం వ‌చ్చిన ఆశ కార్య‌క‌ర్త ఈ నెల 8వ తేదీన పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 

అంత‌కు ముందే ఆ శిశువును భ‌ర్త వెంక‌ట సుబ్బ‌య్య‌, అత‌డి మామ ల‌క్ష్మ‌య్య వారి పొలంలో పాతి పెట్టారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు శుక్ర‌వారం ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి శిశువు మృతదేహాన్ని త‌వ్వి తీశారు. ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారిపై కేసు న‌మోదు చేశామ‌ని, వారిని అరెస్టు చేసి మిగితా వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు తెలిపారు. 
 
 
 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu