మెదక్ జిల్లాలో వైఎస్ షర్మిల దీక్ష: భగ్నం చేసిన పోలీసులు

By narsimha lodeFirst Published Dec 11, 2021, 5:22 PM IST
Highlights

మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకొన్న రైతు రవి కుటుంబానికి కోటి రూపాయాల పరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు ఆందోళన నిర్వహించారు. అయితే ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం నాడు బొగుడు భూపతిపూర్‌లో మూడు గంటల పాటు ఆమె దీక్ష చేశారు.

మెదక్: మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని దీక్ష చేస్తున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు ys Sharmila దీక్షను శనివారం నాడు పోలీసులు భగ్నం చేశారు. మూడున్నర గంటల పాటు షర్మల దీక్ష నిర్వహించారు.హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్‌లో ఆత్మహత్య చేసుకొన్న రైతు Ravi కుటుంబానికి పరిహారం చెల్లించాలని కోరుతూ షర్మిల దీక్ష చేశారు.  రవి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను ఆందోళన కొనసాగిస్తానని ఆమె ప్రకటించారు.  అంతకముందు  షర్మిల మాట్లాడుతూ Farmer రవి కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి Exgratia ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారం ఇచ్చేవరకూ దీక్ష కొనసాగుతుందన్నారు. అప్పటి దాకా ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. స్వయంగా సీఎం పేరు చెప్పి రైతు రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. 

రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వైఎస్ షర్మిల ఆందోళన బాట పట్టారు MLC .ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆమె పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఆమె పాదయాత్రను కొనసాగించనున్నట్టుగా గతంలో ప్రకటించారు. పాదయాత్రకు విరామం ప్రకటించిన నేపథ్యంలో  ప్రజల సమస్యలపై మరోసారి ఆమె పోరాటాన్ని ప్రారంభించారు. ప్రతి మంగళవారం నాడు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే డిమాండ్ తో పాదయాత్రను ఆమె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే పాదయాత్ర సాగుతున్న సమయంలో కూడా ఈ నిరసనలను ఆమె కొనసాగించారు. రాష్ట్రంలోన Trs  సర్కార్ పై షర్మిల తీవ్ర స్థాయిలో  విరుచుకుపడుతున్నారు. 

click me!