భార్య మృతి.. కన్న కూతురిపై కన్నేసిన తండ్రి..!

Published : Sep 23, 2021, 08:54 AM IST
భార్య మృతి.. కన్న కూతురిపై కన్నేసిన తండ్రి..!

సారాంశం

15 రోజులుగా కూతురిపై తన కామ క్రీడలను తీర్చుకోవడం మొదలుపెట్టాడు. స్థానికుల సహాయంతో బాలిక.. ఈ ఊబి నుంచి బయటపడింది.

అనారోగ్య సమస్యలతో అతని భార్య కన్నుమూసింది. భార్య చనిపోయిన తర్వాత.. తల్లిలేని కూతురిని ప్రేమగా చూడాల్సిందిపోయి.. తనలోని రాక్షసుడిని నిద్రలేపాడు ఆ తండ్రి. తండ్రి అనే మాటకు మచ్చ తెచ్చేలా కూతురి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. 15 రోజులుగా కూతురిపై తన కామ క్రీడలను తీర్చుకోవడం మొదలుపెట్టాడు. స్థానికుల సహాయంతో బాలిక.. ఈ ఊబి నుంచి బయటపడింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తి .. ఇటీవల  తన భార్యను కోల్పోయాడు. భార్య మృతి చెందడంతో గత 15 రోజులుగా కుమార్తెపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతనికి దేహ శుద్ది చేశారు. స్థానికుల సహాయంతో బాధితురాలు 100కు సమాచారం అందించడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.