సూర్యాపేటలో జిల్లాలో రోడ్డుప్రమాదం... ట్రావెల్స్ బస్సు బోల్తా, 12మందికి గాయాలు

Arun Kumar P   | Asianet News
Published : Aug 25, 2021, 01:36 PM ISTUpdated : Aug 25, 2021, 01:37 PM IST
సూర్యాపేటలో జిల్లాలో రోడ్డుప్రమాదం... ట్రావెల్స్ బస్సు బోల్తా, 12మందికి గాయాలు

సారాంశం

కాకినాడ నుండి హైదరాబాద్ కు ప్రయాణికులతో బయలుదేరిన ట్రావెల్స్ బస్సు సూర్యాాపేట జిల్లాలో ప్రమాదానికి  గురయ్యింది. ఈ ఘటనలో 12మంది తీవ్రంగా గాయపడ్డారు.  

సూర్యాపేట: ప్రయాణికులతో వెళుతున్న ఓ ట్రావెల్స్ బస్సు సూర్యాపేట జిల్లాలో ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతూ అదుపుతప్పిన బస్సు రోడ్డుపక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో వున్నవారంతా గాయపడ్డారు.  

ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ నుండి హైదరాబాద్ కు ప్రయాణికులతో ఓ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న బస్సును అదుపుచేయడం డ్రైవర్ కు సాధ్యంకాలేదు. దీంతో బస్సు రోడ్డుపై నుండి కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది.   

read more  ప్రకాశం: పెళ్లికూతురును తీసుకువెళ్తుండగా రోడ్డుప్రమాదం... నలుగురు మృతి

ఈ ప్రమాద సమయంలో ప్రయాణికులు, ట్రావెల్స్ సిబ్బంది మొత్తం 33మంది వున్నారు. వీరిలో 12మందికి తీవ్ర గాయాలవగా మిగతావారు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా క్షతగాత్రులను కోదాడ హాస్పిటల్ కు తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే