తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాల విడుదల:ఏపీ విద్యార్థులకు టాప్ ర్యాంకులు

By narsimha lodeFirst Published Aug 25, 2021, 12:12 PM IST
Highlights

తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను  తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం నాడు విడుదల చేశారు.ఈ నెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు.

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు  విడుదలయ్యాయి. హైద్రాబాద్ జేఎన్‌టీయూలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం నాడు విడుదల చేశారు.

ఈ నెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించారు.  ఈ నెల4,5,6 తేదీల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 9,10 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం ఎంసెట్ ప్రవేశపరీక్షలు నిర్వహించారు.

ఇంజనీరింగ్ విభాగంలో సత్తి కార్తికేయ (ఫస్ట్ ర్యాంక్ ).వెంకట ప్రణీత్ (సెకండ్ ర్యాంక్) ఎండీ మతీన్ (మూడో ర్యాంక్)  రామస్వామి సంతోష్ రెడ్డి (నాలుగో ర్యాంక్ ),జ్యోష్యుల వెంకట ఆదిత్య (ఐదో ర్యాంకు) సాధించాడు.పోతనశెట్టి సాయి (ఆరో ర్యాంకు)ఎం. ప్రణయ్ (ఏడో ర్యాంక్), దేశాయి సాయి ప్రణవ్ (8వ ర్యాంకు), దివాకర్ సాయి (9వ, ర్యాంకు) సాత్వికా రెడ్డి (10వ ర్యాంకు) సాధించాడు.

అగ్రికల్చర్ మెడికల్ విభాగంలో మండవ కార్తికేయ (ఫస్ట్ ర్యాంక్), హిమని శ్రీనిజ్ (సెకండ్ ర్యాంకు) సాధించినట్టుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.ఇంజనీరింగ్ విభాగంలో 82.08 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. గతంతో పోలిస్తే 28 వేల మంది విద్యార్థలుు అదనంగా ఈ దఫా పరీక్షలకు హాజరయ్యారని సబితా వివరించారు.

click me!