
హైదరాబాద్: కార్వీ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కార్వీ ఎండీ పార్ధసారథి నిధుల మళ్ళింపు, ఆస్తులపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీపీఎస్ పోలీసులు ఈడీకి బుధవారం నాడు లేఖ రాశారు.
కష్టమర్ల షేర్లను తాకట్టు పెట్టి కార్వీ ఎండీ పార్ధసారధి రుణాలు తీసుకొన్నారని సీసీఎస్ పోలీసులు తెలిపారు.షేర్లను తాకట్టు పెట్టి రూ. 2100 కోట్లను రుణాలు పార్థసారథి తీసుకొన్నారని గుర్తించారు.
తీసుకొన్న రుణాన్ని వ్యక్తిగత కంపెనీలకు కార్వీ ఎండి పార్థసారథి మళ్లించారని గుర్తించారు. రియాల్టితోపాటు ఇన్పోటెక్ కంపెనీలకు నిధులు మళ్లించారని సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు.
సుమారు 900 నుండి రూ. 1000 కోట్ల నిధులను కష్టమర్లకు మోసం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్వీ ఎండి చెబుతున్న రెండు కంపెనీల్లో నిధులు లేని విషయాన్ని పోలీసులు గుర్తించారు.
మొత్తం ఈ విషయ,మై విచారణ నిర్వహించాలని ఈడీకి సీసీఎస్ లేఖ రాసింది. మనీ హవాలాతో పాటు మనీ లాండరింగ్ జరిగిందని కూడ సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విసయ,మై లోతుగా దర్యాప్తు చేయాలని ఈడీని కోరుతూ సీసీఎస్ పోలీసులు ఇవాళ లేఖ రాశారు.
కోర్టు అనుమతితో కార్వీ ఎండీ పార్థసారథిని సీసీఎస్ రెండు రోజుల కస్టడీకి తీసుకొంది.ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి ఆయనను సీసీఎస్ వద్దకు పోలీసులు తీసుకొచ్చారు. రెండు రోజుల పాటు ఈ స్కాం గురించి పోలీసులు విచారించనున్నారు.