హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డుప్రమాదం... 37మందిలో వెళుతూ వ్యాన్ బోల్తా

Arun Kumar P   | Asianet News
Published : Jun 05, 2022, 12:48 PM ISTUpdated : Jun 05, 2022, 12:57 PM IST
హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డుప్రమాదం... 37మందిలో వెళుతూ వ్యాన్ బోల్తా

సారాంశం

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌-బీజాపూర్ రహదారిపై వ్యాన్ బోల్తా పడి 15మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 

రంగారెడ్డి: తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 37మంది ప్రయాణికులో వేగంగా వెళుతున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. అయితే ప్రమాదం ఘోరంగా జరిగినప్పటికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వ్యాన్ లోని 15మంది తీవ్రంగా గాయపడగా మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

హైదరాబాద్ నుండి కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా చెవేళ్ళ మండలం కందాడ స్టేజ్ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై వేగంగా వెళుతున్న వ్యాన్ ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడింది. రోడ్డుపై పల్టీలు కొడుతూ ప్రమాదం ఘోరంగా జరిగినా ప్రాణానష్టం జరగలేదు.  

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా క్షతగాత్రులను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం.  

ఈ ప్రమాదంలో గాయపడినవారంతా హైదరాబాద్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. గుల్బార్గాకు వెళ్ళి తిరిగి వస్తుండగా మరికొద్దిసేపట్లో గమ్యానికి చేరుతారనగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో అప్పటివరకు ఆనందంగా సాగిన వారి  ప్రయాణం హాహాకారాలతో నిండిపోయింది.  

ఇక ఇటీవల కర్ణాటకలో జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిదిమంది సజీవదహనం అయ్యారు. గత శుక్రవారం  ఉదయం కలబుర్గి జిల్లా కమలపురా వద్ద హైదరాబాద్ కు చెందినవారు ప్రయాణిస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురవడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకునే ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. 

హైదరాబాద్ కు చెందిన టెకీ అర్జున్ కుమార్ ప్రతి ఏటా తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు విహారయాత్రలకు వెళ్తుంటారు. గత ఏడాది ఆయన కుటుంబ సభ్యులు తిరుపతికి వెళ్లారు. ఈ దఫా అర్జున్ కుటుంబ సభ్యులు గోవా వెళ్లారు. గత నెల 28న గోవా వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. అర్జున్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు.  ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ ప్రమాదంలో మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. 

కమలాపురా పట్టణ శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టెంపో ట్రాక్స్ ను ఢీకొంది. ప్రమాద తీవ్రత అంతగా లేకున్నా ఒక్కసారిగా మంటలు చెలరేగడమే ప్రాణాలను బలితీసుకుంది. క్షణాల్లో మంటలు బస్సంతా వ్యాపించడంతో ఎనిమిదిమంది సజీవదహనం అయ్యారు. మిగతావారు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారిని కలబురిగిలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందించారు. వీరెవ్వరికీ ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్