శంషాబాద్‌లో అర్ధరాత్రి పబ్‌లను ముట్టడించిన ఎన్‌ఎస్‌యూఐ.. తీవ్ర ఉద్రిక్తత..

Published : Jun 05, 2022, 11:59 AM IST
శంషాబాద్‌లో అర్ధరాత్రి పబ్‌లను ముట్టడించిన ఎన్‌ఎస్‌యూఐ.. తీవ్ర ఉద్రిక్తత..

సారాంశం

హైదరాబాద్‌లో పబ్‌ల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.  ఈ క్రమంలోనే శంషాబాద్‌లోని రెండు పబ్‌లను ఎన్‌ఎస్‌యూఐ నేతలు ముట్టడించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నేతృత్వంలో అర్ధరాత్రి దాటిన తర్వాత బఫెలో, స్పో స్కై పబ్‌ల వద్ద నిరసన తెలిపారు.

హైదరాబాద్‌లోని చాలా పబ్‌లు నిబంధనలుకు విరుద్దంగా.. అశ్లీలతకు అడ్డగా మారుతున్నాయి. వినియోగదారులకు ఆకర్షించే విధంగా.. లేట్ నైట్‌లో కూడా మద్యం, డ్రగ్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. అధికారులు హెచ్చరికలు జారీచేసిన పబ్ యజమానుల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌లో జరిగిన పార్టీకి.. అక్కడికి వచ్చిన బాలికను కొందరు తీసుకెళ్లి కారులో అత్యాచారం జరపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అయితే మైనర్లను సైతం పబ్‌ల్లోకి అనుమతించడం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. 

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో పబ్‌ల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.  ఈ క్రమంలోనే శంషాబాద్‌లోని రెండు పబ్‌లను ఎన్‌ఎస్‌యూఐ నేతలు ముట్టడించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నేతృత్వంలో అర్ధరాత్రి దాటిన తర్వాత బఫెలో, స్పో స్కై పబ్‌ల వద్ద నిరసన తెలిపారు. వాటిని మూసివేయాలని నినాదాలు చేశారు. ఎయిర్‌పోర్టు వద్ద అర్దరాత్రి దాటిన తర్వాత పబ్‌లు తెరవడం ఎన్‌ఎస్‌యూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అనుమతులు లేకున్నా పబ్ నిర్వాహకులు తెల్లవార్లూ మద్యం సరఫరా చేస్తున్నారిని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజాము వరకు పబ్‌లు నడుస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేవలం బోర్డింగ్ పాస్ ఉన్నవాళ్లకు మాత్రమే మద్యం సరఫరా చేయాల్సి ఉండగా అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మద్యం సరఫరా చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలోనే పబ్ నిర్వాహకులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసకుంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని ఎన్‌ఎస్‌యూఐ నాయకులను అక్కడి నుంచి తరలించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?