కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... చిన్నారి పరిస్థితి విషమం (వీడియో)

Published : Aug 20, 2021, 12:51 PM ISTUpdated : Aug 20, 2021, 01:01 PM IST
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... చిన్నారి పరిస్థితి విషమం (వీడియో)

సారాంశం

హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ప్రమాదానికి గురవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గాయపడ్డారు. వీరిలో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా వుంది. 

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు కూతుళ్లతో కలిసి దంపతులు కారులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కారు అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మిగతా ముగ్గురికి చిన్నచిన్న గాయాలయ్యాయి. 

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులో హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన చిన్నారిని కామారెడ్డికి తరలించి ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. పాప పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.  

వీడియో

హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు కుటుంబంతో కలిసి కారులో బయలుదేరాడు నవీన్. అయితే డ్రైవర్ సీటు పక్కనే కూర్చున్న భార్య ఒళ్లో కూతురిని పడుకోబెట్టుకుంది. అయితే హైవేపై కారు వేగంగా వెళుతున్న సమయంలో చిన్నారి కాలు స్టీరింగ్ కు తగిలింది. దీంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. 
 

PREV
click me!

Recommended Stories

రూ. 1641 కోట్ల‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం.. ఈ రెండు ప‌ట్ట‌ణాల మ‌ధ్య త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం
Fertility: తెలంగాణ‌లో ప‌డిపోతున్న సంతానోత్ప‌త్తి.. ఫెర్టిలిటీ చికిత్సల్లో పారదర్శకత పెరగాల్సిందే