జయశంకర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Published : May 31, 2018, 10:38 AM ISTUpdated : May 31, 2018, 11:05 AM IST
జయశంకర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

సారాంశం

కారు-బైక్ ఢీకొనడంతో ప్రమాదం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ములుగు మండలం జాకారం సమీపంలో కారు-బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శాయంపేట  మండలం గంగిరేణిగూడెం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇవాళ తెల్లవారుజామున బైక్ పై వెళుతున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ములుగు మండలం జాకారం సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బైక్ పై వున్నవారు ఎగిరి రోడ్డు పక్కన పడ్డారు. ఈ ప్రమాదంలో బైక్ పై వున్న తండ్రీ, కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలతో తల్లి మాళవిక, కూతురు అనూష ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

 ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై CM రేవంత్ రెడ్డి గూస్ బంప్స్ స్పీచ్| Sardar Sarvai Papanna Goud
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | Sardar Sarvai Papanna Goud