Hyderabad Accident: శామీర్ పేటలో బీభత్సం... ఏడు కార్లను ఢీకొట్టిన ఆర్మీ వాహనం

Arun Kumar P   | Asianet News
Published : Dec 19, 2021, 10:00 AM ISTUpdated : Dec 19, 2021, 10:31 AM IST
Hyderabad Accident: శామీర్ పేటలో బీభత్సం... ఏడు కార్లను ఢీకొట్టిన ఆర్మీ వాహనం

సారాంశం

హైదరాబాద్ శివారులో ఓ ఆర్మీ వాహనం ఏడు కార్లను ఢీకొడుతూ బీభత్సం సృష్టించింది.  

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) లో ఇండియన్ ఆర్మీ (indian army) వాహనం బీభత్సం సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కార్లను ఢీకొడుతూ ముందుకెళ్లిన ఆర్మీ వాహనం ఘోర ప్రమాదానికి కారణమయ్యింది. శనివారం సాయంత్రం సమయంలో హైదరాబాద్ శివారులో ఈ యాక్సిడెంట్ జరిగింది.

మేడ్చల్ జిల్లా (medchal district) తూంకుంట సమీపంలోని రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరం నుండి బయటకు వెళుతున్న ఆర్మీ వాహనం అలంకృత రిసార్డ్ వద్దకు రాగానే అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఇలా ఏడు కార్లను ఢీకొడుతూ ముందుకెళ్లింది. దీంతో మూడు కార్లు బాగా ధ్వంసమవగా మరో నాలుగు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. 

అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసారు.

read more  Hyderabd road accident : డివైడర్ ఢీకొన్న కారు, డ్రైవర్ సహా ఇద్దరు లేడీ జూనియర్ ఆర్టిస్టుల మృతి

ఇదిలావుంటే కామారెడ్డి జిల్లాలో నిన్న (శనివారం) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఆగివున్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 
 
మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. బిచ్చుంద మండలం జగన్నాథపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా వున్నట్లు తెలుస్తోంది. మరో ఆరుగుతు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం క్షతగాత్రులను బాన్సువాడ, నిజామాబాద్‌ ఆస్పత్రులకు తరలించారు.  

క్వాలిస్ వాహనంలో హైదరాబాద్ కు చెందిన 12మంది మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఖందర్‌ దర్గాలో మొక్కులు చెల్లించుకోడానికి వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్‌ మండలం జగన్నాథ్‌పల్లి గేట్ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న లారీని వెనకనుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. 

read more  Hyderabad Accident: మందుబాబుల బీభత్సం... డివైడర్ పైనుండి గాల్లో పల్టీలు... మరో కారును ఢీకొన్న ఐ20

ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడ్డారు.   సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు.  

మృతుల వివరాలు: 

 అమీర్‌ తాజ్‌ (30)

సనా ఫాతిమా (28)

హనియా(2)

 హన్నాఫ్(4 నెలలు) 

నూరా (7)

మహమ్మద్‌ హుస్సేన్‌ (35)

తస్లీమ్‌ బేగం (30)

ఈ  ఘోర రోడ్డుప్రమాదాన్ని మరిచిపోకముందే హైదరాబాద్ శివారులో ఆర్మీ వాహనం ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇలా ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు చాలామంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కాబట్టి ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా వుండాలని... ముఖ్యంగా వాహనాలు డ్రైవింగ్ చేసేవారు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు.

 
 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?