
విఫలమయిన బోర్ బావులను నిర్లక్ష్యంగా వదిలేసి పసిపిల్లలు ప్రాణాలుపోయేందుకు కారకులైన భూమి యజమానులను, బోర్ యజమానులను మొదటి శిక్షించిన కీర్తి ఒక తెలంగాణా కోర్టు దక్కింది. మెదక్ సెషన్స్ కోర్టు ఒక సంచలన తీర్పు వెలువరిస్తూ బోర్ వేయించుకున్నభూమి యజమానికి, రిగ్గు యాజమానికి చేరో ఐదేళ్ల జైలు శిక్ష కోర్టు విధించింది. దీనితో పాటు ఇద్దరికి చెరో రు. పదివేల జరిమానా కూడా విధిస్తూన్యాయమూర్తి వాణి తీర్పు ఇచ్చారు.
తెలుగురాష్ట్రాలలో ఇలాంటి తీర్పు వెలువడటం ఇదే మొదటిసారి. ఈ మధ్య బోరు బావులు పూడ్చేయకపోవడంతోఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో తెలిసిందే. పొలాల పనిచేసే వ్యవసాయ కార్మికుల పిల్లలు, వూరికిసమీపంలో ఆడుకుంటున్న పిల్లలు ఈ బోరు గుంతలలో పడిపోతున్నారు.చాలా సందర్భాలలో పిల్లను సకాలంలో వెలికి తీయలేకపోవడంతో వారు చనిపోయారు. భూమియజమాని, రిగ్ యజమాని నిర్లక్ష్యం వల్ల తల్లితండ్రులు,ప్రభుత్వం, ప్రజలు బోర్ లో పడిన పిల్లల గురించి ఎంత హైరానా పడేవారో చూశాం.
ప్రభుత్వాలు కూడా బోర్ బావులను పూడ్చేయడాన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా తీసుకుంటున్నాయి.ఈ నేపథ్యం లో మెదక్ కోర్టు తీర్పు వెలువడింది.
సంగారెడ్డిజిల్లా బొమ్మారెడ్డి గూడెంకు చెందిన బోరు బావి కేసొకటి కోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసు ప్రకారం 2015లో రాకేశ్ (3) అనే పిల్లవాడు అక్కడ నిర్లక్ష్యంగా వదిలేసిన బోరుబావిలో పడ్డారు. బోర్ బావిని కుమ్మరి రాములు తన పొలంలో కావటి వెంకటేశ్ అనే రిగ్ యజమాని తో బోర్ వేయించారు.బోర్ ఫెయిలయింది. అయినా బొర్ ను పూడ్చలేదు. ఈ బోర్ లో రాకేేశ్ పడ్డారు. అతి కష్టం మీద రాకేశ్ ను వెలికి తీసినా, కొద్ది గంటల్లోనే చనిపోయాడు. దీనిమీద రాకేశ్ తల్లితండ్రులు భూమి, రిగ్ యాజమాని మీద కేసు పెట్టారు. కోర్టు నిన్న ఈ తీర్పు ఇచ్చింది.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి
https://goo.gl/6BMx27