
హైదరాబాద్ : సమ్మక్క సారలమ్మలపై త్రిదండి Chinna Jeeyar Swamy చేసిన వ్యాఖ్యలపై టిపిసిసి అధ్యక్షులు Rewanth Reddy ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిమీద ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన ‘సమ్మక్క, సారలమ్మ’లను అవమానపరిచిన త్రిదండి చినజీయర్ ని Yadagiri Gutta ఆగమ శాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే KCR తొలగించాలి. మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, తాజాగా చిన్న జీయర్ స్వామి మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో చిన్న జీయర్ స్వామి ఏదో ప్రసంగం సందర్భంగా సమ్మక్క సారలమ్మలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చాలా పాత వీడియో. ఏ సందర్భంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారో తెలియడం లేదు. కానీ, దీని మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలామంది ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
ప్రస్తుతం వైరల్ గా మారిన చిన్న జీయర్ స్వామి ఆ వీడియోలో Sammakka Saralamma గురించి ప్రస్తావించారు. వారు దేవతలు కాదని చెప్పుకొచ్చాడు. అసలు సమ్మక్క సారలమ్మలు ఎవరని ప్రశ్నించారు. వారు ఏదో గ్రామ దేవతలని చెప్పారు. కానీ, చదువుకున్నవారు.. పెద్ద పెద్ద బిజినెస్ మేన్ లు కూడా వారిని నమ్ముతున్నారని తెలిపారు. వారి పేర్లతో బ్యాంకులు కూడా పెట్టేశారని.. ఆ పేరు ప్రస్తుతం పెద్ద వ్యాపారం అయిపోయిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో బయటకు వచ్చిన నాటి నుంచి చిన్న జీయర్ స్వామిని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ఆయన ఆంధ్రాకు చెందిన స్వామి అని అందుకే తెలంగాణ దేవతలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ వనదేవతలుగా కొలుస్తున్నామని బహుజన దేవతల పై దాడి తగదని మండిపడుతున్నారు. వాట్సప్ ఫేస్బుక్ స్టేటస్ లో షేర్ చేస్తూ వారి అభిప్రాయాన్ని జత చేస్తున్నారు. చిన్న జీయర్ వ్యాఖ్యలపై ములుగు ఎమ్మెల్యే సీతక్క, సిపిఐ నేత నారాయణ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు…
చిన్న జీయర్ స్వామి గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కులాలు ఉండాలని, ప్రతి ఒక్కరూ తమ కులవృత్తిని నిర్వహించాలని చెప్పిన వీడియో ఆయనపై విమర్శలు వచ్చేలా చేసింది. కొందరు ప్రగతిశీల భావాలు ఉన్నవారు కులాలు పోవాలి అని అంటున్నారని కానీ అది తప్పని ఆ వీడియోలో చెప్పారు. మరో వీడియోలో ఆహారపు అలవాట్ల పై కామెంట్ చేశారు. పంది మాంసం తింటే ఆలోచిస్తారని, మేక మాంసం తింటే మేక ఆలోచనలే వస్తాయని, కోడి మాంసం తింటే పెంట మీద ఏరుకుతినే ఆలోచనలు వస్తాయని ఆ వీడియోలో అన్నారు.
ఇక సమ్మక్క సారలమ్మలపై చినజీయర్ చేసిన వ్యాఖ్యల మీద నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, సీపీఐ నేత నారాయణ, బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చిన జీయర్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఆదివాసీ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో ఆదివాసీ నాయకపోడు సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.