ఎర్రబెల్లి కారులో వచ్చి కాంగ్రెస్ నేతలకు కొందరి వార్నింగ్.. కామారెడ్డిలో సభా స్థలి వద్ద ఉద్రిక్తతలు

Published : Mar 18, 2022, 01:46 PM ISTUpdated : Mar 18, 2022, 01:55 PM IST
ఎర్రబెల్లి కారులో వచ్చి కాంగ్రెస్ నేతలకు కొందరి వార్నింగ్.. కామారెడ్డిలో సభా స్థలి వద్ద ఉద్రిక్తతలు

సారాంశం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాంగ్రెస్ తలపెడుతున్న కార్యక్రమం కోసం సభ ఏర్పాట్లలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అక్కడ తలమునకలై ఉన్నారు. ఈ సమయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారులో వచ్చిన కొందరు హల్ చల్ చేశారు. అక్కడ ఆ మీటింగ్ జరగనివ్వబోమని వార్నింగ్ ఇచ్చారు.  

హైదరాబాద్: కామారెడ్డి ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ తలపెట్టనున్న ఓ కార్యక్రమానికి సభా స్థలి వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారులో వచ్చిన కొందరు అక్కడ హల్ చల్ చేశారు. కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ మీటింగ్ జరిగేదే లేదని తెగేసి చెప్పారు. కాంగ్రెస్ మీటింగ్‌ను ఆపేస్తామని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డిలో మన ఊరు మన పోరు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. త్వరలోనే నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సభా స్థలిని సిద్ధం చేస్తున్నారు. ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్న ప్రాంతానికి ఎర్రబెల్లి దయాకర్ రావ్ ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న కారు అక్కడికి వచ్చి చేరింది. అందులో నుంచి దిగిన వ్యక్తులు హల్ చల్ చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ కార్యక్రమాన్ని సాగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. స్పాట్‌కు చేరుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా, ఒకరు పరారీలో ఉన్నట్టు తెలిసింది.

ఇదిలా ఉండగా, బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ స్టిక్కర్ ఉన్న థార్ యాక్సిడెంట్ చేయడంతో ఓ పసికందు మరణించింది. జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ కారు ప్రమాదానికి సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదం చేసిన కారు డ్రైవర్ గురువారం రాత్రి నుంచి పరారీలో ఉన్నాడు. కారు ఢీకొనడంతో మహిళ ఒడిలో ఉన్న రెండున్నర నెలల పసికందు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మరో ముగ్గురు గాయపడ్డారు. మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్ చేతిలో ఉన్న పసికందు జారిపడి మరణించాడు. మహారాష్ట్రకు చెందిన మహిళతో పాటు ఇతరులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ప్రమాదం చేసిన కారు తనది కాదని తొలుత బుకాయించిన నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ చివరకు ఆ కారు తనదేనని అంగీకరించారు. ప్రమాదం చేసిన కారుపై బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కారు తనదే అయినప్పటికీ ప్రమాదంతో తనకు ఏ సంబంధం లేదని షకీల్ చెప్పారు. తాను ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్లు తెలిపారు. కారు డ్రైవర్ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. 

షకీల్ డ్రైవర్ కారును నడిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ కారును నిజామాబాద్ మిర్జా ఇన్ ఫ్రా కంపెనీ పేర కొన్నాళ్ల క్రితం కొనుగోలు చేశారు. 15 రోజుల క్రితమే కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించినట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu