తెలంగాణ ఉద్యమ కాలంలో కేటిఆర్ అమెరికాలో ఉన్నారని, హరీష్ రావు టీఆర్ఎస్ కోసం ఎంతో కష్టపడ్డారని రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారో కేటీఆర్ కేసీఆర్ ను అడగాలని ఆయన అన్నారు.
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లోని అంతర్గత వ్యవహారాలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటి రామారావు చేసిన వ్యాఖ్యలపై ఆయన బుధవారం మండిపడ్డారు.
కేసిఆర్ రాజకీయ వారసుడిగా హరీష్ రావును ప్రకటిస్తే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని ఆయన చెప్పారు. కేసిఆర్ ఆ ప్రకటన చేయాలని ఆయన అన్నారు. హరీష్ రావును తన రాజకీయ వారసుడిగా ప్రకటించే దమ్మూ ధైర్యం కేసిఆర్ కు ఉందా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో కేటిఆర్ అమెరికాలో ఉన్నారని, హరీష్ రావు టీఆర్ఎస్ కోసం ఎంతో కష్టపడ్డారని రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారో కేటీఆర్ కేసీఆర్ ను అడగాలని ఆయన అన్నారు. దళితనేతను ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని ఆయన అన్నారు. ఇప్పుడు హరీష్ రావును వెన్నుపోటు పొడుస్తున్నారని రేవూరి వ్యాఖ్యానించారు.
అన్ని ప్రభుత్వ శాఖల్లో జోక్యం చేసుకునే అధికారం కేటీఆర్ కు ఎక్కడిదని ఆయన అడిగారు. కేటిఆర్ వయస్సును గౌరవించడం నేర్చుకోవాలని, చంద్రబాబుపై దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు.
సంబంధిత వార్తలు
కట్టుబడి ఉన్నా: హరీష్ మీది వ్యాఖ్యలపై రేవూరి ప్రకాష్ రెడ్డి
టీఆర్ఎస్‌లో హరీష్ స్థితిపై రేవూరి సంచలన వ్యాఖ్యలు