వారం రోజులు రేవంత్ రెడ్డి అక్కడే మకాం

Published : Oct 19, 2017, 10:33 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
వారం రోజులు రేవంత్ రెడ్డి అక్కడే మకాం

సారాంశం

రాజకీయ వేడిని పెంచుతున్న రేవంత్ వారం రోజుల మకాం పై జోరుగా ఊహాాగానాలు మరిన్ని సంచనాలు ఉంటాయంటున్న అనుచరులు

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్, టిడిఎల్పీ నేత రేవంత్ రెడ్డి వారం రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. తెలంగాణలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటన్న తరుణంలో రేవంత్ వారం రోజుల పాటు కదలకుండా మకాం వేయడం ఆశ్చర్యం కలగక మానదు. ఇంతకూ రేవంత్ వారం రోజులపాటు మకాం వేయడం గురించి తెలుసుకోవాలంటే కింద చదవండి.

తెలంగాణలో హాట్ హాట్ గా ఉన్నాయి రాజకీయాలు. వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. టిడిపిలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఆయన ఇప్పటికే కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఢిల్లీలో చర్చించారు.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి టిడిపిని వీడతానన్న విషయమై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఎపి టిడిపి నేతలు తెలంగాణ సిఎం కేసిఆర్ తో చీకటి స్నేహం చేస్తున్నారని, ఆర్థికపరమైన స్నేహం నడుపుతున్నారని కుండబద్ధలు కొట్టారు రేవంత్. ఎపి నేత యనమలకు రెండువేల కోట్ల విలువైన కాంట్రాక్టు ను కేసిఆర్ కట్టబెట్టారని, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ లాంటి వాళ్లు కూడా కేసిఆర్ తో ఆర్థికపరమైన స్నేహం నడుపుతున్నారని ఆరోపించారు రేవంత్.

తెలుగు రాజకీయాల్లో ఈ సంచలన ఆరోపణలు చేసి ఎపి టిడిపి నేతల బట్టలు ఊడదీశారు రేవంత్. దీంతో తెలుగుదేశం వర్గాల్లో రేవంత్ మాటలు తీవ్ర కలకలం రేపాయి. ఇవన్ని ఇలా ఉంటే రేవంత్ రెడ్డి వారం రోజులపాటు తన నియోజకవర్గం అయిన కొడంగల్ లోనే మకాం వేయనున్నారు అని తెలిసింది. ఆయన దీపావళి సందర్భంగా కొడంగల్ వెళ్లి వారం రోజులు నియోజకవర్గంలోనే గడుపుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ మారుడుపై వస్తున్న విమర్శలు, జరుగుతున్న చర్చలపై ఈ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముఖ్యమైన నేతలు, కార్యకర్తలతో ఈ వారం రోజులపాటు రేవంత్ చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను ఏవిధమైన కార్యాచరణతో పోవాలనేదానిపై ముందుగా నియోజకవర్గంలోని తన సన్నిహితులు, ముఖ్యమైన అనుచరులు, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు షేర్ చేసుకుంటారని అంటున్నారు.

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న ఉద్దేశంతోనే రేవంత్ వారం రోజులపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉన్న తన అభిమానుల అభిప్రాయాలు తెలుసుకుంటారని, వారి సమ్మతిని కోరతారని అంటున్నారు. అయితే ఈనెల 28 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుపుతారని సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈనెల 28 వరకు రేవంత్ నియోజకవర్గంలోనే ఉంటారని తెలుస్తోంది. అన్ని గ్రామాల నేతల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత తన నిర్ణయాన్ని ముందుగా నియోజకవర్గ నేతలతో చెప్పే అవకాశం ఉందంటున్నారు. అనంతరం హైదరాబాద్ వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

మొత్తానికి కీలకమైన తరుణంలో వారం రోజులపాటు రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు దూరంగా మారుమూల గ్రామంలో ఉండడం చూస్తుంటే ముందుగా నియోజకవర్గ ప్రజలను ఒప్పించిన తర్వాతే ఆయన తదుపరి రాజకీయ కార్యాచరణ ప్రకటించే అవకాశముందని రేవంత్ రెడ్డి సన్నిహిత నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!