లోక్ సభ ఎన్నికలు : బీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోన్న సర్వే...

By SumaBala Bukka  |  First Published Dec 14, 2023, 10:56 AM IST

తెలంగాణలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 8-10 స్థానాలు గెలుస్తుందని, బిఆర్ఎస్ 3-5 స్థానాలు దక్కించుకుంటుందని ఈ  సర్వే విశ్లేషించింది.


హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగలనుందా అంటే.. అవుననే అంటున్నాయి తాజా సర్వేలు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సర్వేలో చెప్పినట్టుగానే భారీ షాక్ తగిలింది. 64 సీట్ల మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, పట్టణ ప్రాంత ప్రజలు మాత్రం బిఆర్ఎస్ కి పట్టంకట్టాయి. కాంగ్రెస్ పాలన ప్రారంభమై  నేటికీ సరిగ్గా వారం రోజులు. ఈ క్రమంలో వెలుగు చూసిన మరో సర్వే బీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. మరో కొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవా చాటబోతోందని టైమ్స్ నౌ ఈటిజి సంస్థ చేసిన సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే..  ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయని అంచనా వేసింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో టైమ్స్ నౌ సర్వే అంచనాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఎనిమిది నుంచి పది స్థానాలు గెలుస్తుందని, బిఆర్ఎస్ మూడు నుంచి ఐదు స్థానాలు దక్కించుకుంటుందని ఈ  సర్వే విశ్లేషించింది. బిజెపి కూడా మూడు నుంచి ఐదు స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే తెలిపింది. 

Latest Videos

తుమ్మును ఆపుకుంటే.. శ్వాసనాళం పగిలిపోయింది...

ఇక ఈ మూడు పార్టీల నుంచి కాకుండా ఇతరులు ఒక స్థానం గెలుచుకుంటారని పేర్కొంది. లోక్సభ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పుంజుకునే అవకాశం లేదని తేల్చి చెప్పింది. లోక్సభ ఎన్నికలకు ఇంకా మూడు నెలల టైం ఉంది. ఏ సమయంలోనైనా ఈ అంచనాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తీసుకుంటున్ననిర్ణయాల వల్ల ఇప్పటి సర్వే ఇలా వచ్చింది. పాలనాపరంగా ఆయన తీసుకునే నిర్ణయాలే పార్టీకి ఓట్లుగా మారుతాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారం మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే వేసింది. పార్లమెంటు ఎన్నికల వరకు పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డినే కొనసాగిస్తారని సమాచారం.  మరోవైపు ఎన్నికల తర్వాత అనారోగ్యం పాలైన కెసిఆర్.. ఈ సర్వే నేపథ్యంలో అలర్ట్ అయినట్టుగా సమాచారం. పూర్తిగా కోలుకున్న తర్వాత.. ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. తెలంగాణలో రెండు, మూడు స్థానాలకు పరిమితమైన బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకుని వోట్ షేర్  పెంచుకుంది. లోక్సభ ఎన్నికల్లో తమకు మోడీ ఛరిష్మా కలిసి వస్తుందని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవచ్చని బిజెపి అంచనా వేస్తుంది.. ఈ క్రమంలో మూడు నుంచి ఐదు స్థానాలు మాత్రమే  వస్తాయని సర్వే తేల్చడంతో బిజెపి కూడా అలర్ట్ అవుతోంది.

click me!