CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి గుండెపోటు.. !

Published : Mar 08, 2024, 01:37 AM IST
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి గుండెపోటు.. !

సారాంశం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కాసేపటి క్రితమే గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు  ఆస్పత్రికి తరలించారు.

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అస్వస్థతకు గురయ్యారు. ఎనుముల తిరుపతి రెడ్డికి గురువారం రాత్రి గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు  హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో..  వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడంగా ఉందని బంధువులు వెల్లడించారు. మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోదరుడ్ని సీఎం రేవంత్ మరో సోదరుడు కొండల్ రెడ్డి పరామర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి  కొడంగల్ నియోజక వర్గం కాంగ్రెస్ ఇంఛార్జీగా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి విజయం సాధించడంలో ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఆయనకు నియోజక వర్గంలో మంచి పట్టు ఉండటమే కాకుండా.. యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదిలాఉంటే.. ఆయన తన ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!
Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపుర్ కావ‌డం ఖాయం