చచ్చిన పామును ఎన్నిసార్లు చంపుతాం.. కేసీఆర్ పై రేవంత్ సెటైర్..

By SumaBala Bukka  |  First Published Feb 14, 2024, 2:23 PM IST

కేసీఆర్ ను ఎవ్వరూ చంపాల్సిన అవసరం లేదని.. చచ్చిన పామును ఎన్నిసార్లు చంపుతారంటూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడిన భాషపై చర్చిద్దామా అంటూ సవాల్ విసిరారు. 


హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నేడు హాట్ హాట్ గా జరిగాయి.  బుధవారం నాడు అసెంబ్లీలో ఇరిగేషన్ మీద శ్వేత పత్రాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు, అధికార కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మాట్లాడిన భాష మీద అభ్యంతరం, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ కి తెలంగాణ సమాజం మీద, రైతులకు మీద గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మేడిగడ్డకు వచ్చేదని అన్నారు.

ఇదే సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టిఆర్ఎస్ నేతలు పదేపదే భాష గురించి మాట్లాడుతున్నారు.. నిన్న నలగొండ సభలో మాజీ సీఎం మాట్లాడిన భాషపై చర్చిద్దామా?  అని ప్రశ్నించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి…ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ‘పీకనీకి పోయారా’ అని మాట్లాడతారా? ఇది మాట్లాడే భాషేనా? మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీ ప్యాంటుని పీకేశారు. ఇప్పుడు షర్టు కూడా పీకేస్తారు అంటూ ఫైర్ అయ్యారు. మేడిగడ్డ కుంగిపోతే అందులో నీళ్లు నింపడానికి అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు. 

Latest Videos

Medaram Jathara : మీ ఇంటివద్దకే మేడారం ప్రసాదం... ఇలా పొందండి...

కడియం శ్రీహరి, హరీష్ రావులకే పెత్తనం ఇస్తాం, నీళ్లు నింపి చూపించండి అని సవాలు విసిరారు. మేడిగడ్డ మీద చర్చకు సిద్ధమైతే మీ సభాపక్షనేతను అసెంబ్లీకి రమ్మనండి. కాలేశ్వరంపై, నదీ జరాలపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం.. అన్నారు. నిన్న నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ ను చంపుతారా అని అంటున్నాడు. ఆయనను చంపడానికి మాకేం అవసరం ఉంది.. చచ్చిన పామును ఎవరైనా చంపుతారా? అంటూ ఎద్దేవా చేశారు. 

మీరు చెప్పినట్టు మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగినై అంటే సభలో చర్చ చేద్దాం రండి.. అట్లా కాకుండా పోయి అక్కడెక్కడో సభ పెట్టి ప్రగల్భాలు పలకడం ఎందుకు  అని ప్రశ్నించారు. కాలేశ్వరంపై మేము చర్చకు సిద్ధం, సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని మీద చర్చించండి అన్నారు. 

దీనిమీద బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర అభ్యంతరం తెలిపారు. నిండు సభలో ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిగా గౌరవం కాపాడుకోవాలని, సంయమనం పాటించాలని తెలిపారు. ముఖ్యమంత్రి.. రాజగోపాల్ రెడ్డిలా మాట్లాడకూడదని అన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చీడపురుగు అంటూ కడియం శ్రీహరి మండిపడ్డారు. కాంగ్రెస్ ను మోసం చేశాడని రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు సభనుంచి వాకౌట్ చేశారు. 

click me!