CM Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి కేసీఆర్ కు ఆహ్వానం

By Arun Kumar PFirst Published Dec 6, 2023, 1:20 PM IST
Highlights

గురువారం తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.  ఈ కాార్యక్రమానికి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. బిఆర్ఎస్, బిజెపిలకు గట్టి పోటీఇచ్చి 64 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇలా అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి పేరును ఖాయం చేసింది. దీంతో నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారాన్ని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవం రేపు(గురువారం) ఎల్బీ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానించారు రేవంత్. అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు మరికొందరు కాంగ్రెస్ పెద్దలను కూడా రేవంత్ ఆహ్వానిస్తున్నారు.  

Latest Videos

ఇలా తెలంగాణ నూతన సీఎం ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అతిథుల లిస్ట్ ఇప్పటికే తయారయ్యింది. ఇందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస అధినేత కేసీఆర్ పేరుకూడా వుంది. ఆయనకు ఆహ్వానం పంపించాలని రేవంత్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. 

Read More  CM Revanth Reddy : రేవంత్ గట్టోడే... అంతటి సీనియర్ తో సాధ్యంకానిది సాధించి చూపించాడు...

ఇక పొరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా రేవంత్ ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో పాటు తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు స్టాలిన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లను కూడా ఆహ్వానించనున్నారు. అలాగే  కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రులతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానిస్తున్నారు. కేంద్రమంత్రులు, తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన వారిని ఆహ్వానిస్తున్నారు. 

తెలంగాణ ఉద్యమంలో ప్రాణాల కోల్పోయిన అమరుల కుటుంబాలు కూడా రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వారికి ఆహ్వానాలు కూడా పంపారు. అలాగే మేధావులు, పౌరహక్కుల సంఘాల నాయకులు, కులసంఘాల నేతలు కూడా ఈ ప్రమాణస్వీకారంలో పాల్గొననున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు ఇతర న్యాయమూర్తులకు కూడా ఆహ్వానం పలకాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. 

click me!